Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,948
Total recovered
Updated on December 10, 2022 11:28 AM

ACTIVE

India
5,131
Total active cases
Updated on December 10, 2022 11:28 AM

DEATHS

India
530,654
Total deaths
Updated on December 10, 2022 11:28 AM

సహృదయంతో స్పందించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

అమలాపురం, అక్టోబర్ 2: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కారామే శ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతులకు చెందిన రెండున్నర సంవత్సరాల చిన్నారి హనీ కి గాకర్స్ వ్యాధి పుట్టుకతో వచ్చిందని ఈ వ్యాధిమూలంగా లివరు పనిచేయదని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు ఇటీవల గోదావరి వరదలు మూలంగా వరద ప్రాంతాల సందర్శనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని కలవడానికి ఆ దంపతులు ప్లే కార్డు ప్రదర్శించి కాన్వాయ్ ని ఆపి ముఖ్యమంత్రి వర్యులకు ఆ దంపతులు పాపకు అనారోగ్యంగా ఉందని మీరే సహకారం అందించాలని కోరగా ఆయన వెంటనే స్పందించి అక్కడికక్కడే ప్రభుత్వ ఉన్నతా ధికారులు వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి వైద్య సహాయం అందించాలని ఆదేశించా రని ఆ మేరకు గత రెండు నెలలుగా ప్రతిపాదనలు ప్రభుత్వానికిపంపడం జరిగిందని అవి మంజూరు కావడం తో పాటు పాప హాని భవిష్యత్తు కొరకు మొత్తం ముఖ్యమంత్రి వర్యులు కోటి రూపాయలు బడ్జెట్ కేటాయించారని కలెక్టర్ తెలిపారు. ఈ గాకర్స్ వ్యాధి నివారణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసి ప్రస్తుతం 13 ఇంజక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపడం జరిగిందన్నారు ఈ ఇంజక్షన్ ఖరీదు రూ 1,25,000 రాయితీతో రూ 74,000 లకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగా ఇప్పించడం జరిగిందని ఈ ఇంజక్షన్ అమెరికాలో తయారవు తుందని ఇప్పటివరకు రూ 10 08,000లు విలువచేసే ఇంజక్షన్లను ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా చేశారని తెలిపారు. ఈ ఇంజక్షన్ 15 రోజులకు ఒక మారు రెగ్యులర్ గా పాపకి ఇవ్వాలని, పాప భవిష్యత్తు ఎడ్యుకేషన్ పరంగా కూడా ముఖ్యమంత్రివర్యులు స్పందించి ఉదారంగా సహకారం అందించా రన్నారు. పాప భవిష్యత్తుకు కూడా ప్రణాళికను రచించడo జరుగు తోందన్నారు. పింఛన్ ఇప్పించేం దుకు కూడా చర్యలు చేపట్టామ న్నారు దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు 14 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి వైద్యం ఇప్పటివరకు అందించలేదని తొలుతగా స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు ఈ తరహా వ్యాధి నివారణ చర్యలు ఆరంభమయ్యాయన్నారు. శరీరం లో జీవక్రియలు జరగడానికి లివర్ అనేది చాలా ముఖ్యమని ఇది జీవితాంతం ఉండిపోతుందని ప్రతి నెల రెండు పర్యాయాలు అందించా ల్సిందన్నారు. పాప తండ్రి కొప్పాడ రాంబాబు తన స్పందన తెలియ జేస్తూ ముఖ్యమంత్రి వర్యులను కలవగానే ఎంతో ఉదాహరo గా స్పందించి ఎంత ఖర్చయినా పర్వాలేదు నేను ప్రభుత్వపరంగా ఆదుకుంటానని భరోసా కల్పించా రన్నారు. భరోసా ఇచ్చిన రెండు నెలల్లో వైద్య సేవలు ఆరంభం కావడం ఎంతో సంతోషంగా ఉంద న్నారు. చిన్నారి తల్లి నాగలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి వ్యాధి ఏ ఒక్కరికి రాకూడదని అన్నారు. తమది పేద కుటుంబమని వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవడంతో చిన్నారి హనీ భవిష్యత్తు పై ఆశలు చిగు రుస్తున్నాయని తెలిపారు. ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రి నందు జిల్లా కలెక్టర్ వారు పాప తల్లిదండ్రులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా చేసీన 13 ఇంజక్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సిహెచ్ భరత్ లక్ష్మి స్థానిక ప్రజా ప్రతినిధులు చెల్లుబోయిన శ్రీనివాస్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!