Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 2:11 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 2:11 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 2:11 AM
Follow Us

నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– సువార్త ధన నిధి రూ.4 లక్షలు ఎ.ఈ.ఎల్.సి.కి చెల్లించాను
– దానికి రసీదు కూడా ఇచ్చారు
-పిసిసి.సభ్యులకు ఆ సంగతి తెలుసు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

సువార్త పరిచర్య కోసం సంఘ విశ్వాసులు నుంచి స్వీకరించిన సువార్త ధన నిధి (ఎస్.డి.ఎన్) సొమ్ము రూ.4 లక్షలు తను స్వాహా చేసినట్లు పిసిసి సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చర్చి పాస్టర్ రెవ అక్కాబత్తుల సామ్యూల్ రాజు ఖండించారు. తాను 2019లో బాధ్యతలు స్వీకరించానని కాని 2017 నుంచి తను ఉన్నట్లుగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూతాను సెయింట్ పీటర్స్ లూథరన్ దేవాలయము సంఘ కాపరిగా జూన్ 2019లో నియమించబడ్డానని, తదుపరి 2020 నవంబర్ లో తూర్పు గోదావరి జిల్లా సినడ్ లో గల సుమారు 150 సంఘాలకు అధ్యక్షులుగా,ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని వివరించారు.రాజమండ్రి సెయింట్ పీటర్స్ లూథరన్ సంఘం పాలనా సౌలభ్యం కోసము – పారిష్ చర్చి కౌన్సిల్ కు ఎన్నిక ద్వారా ఆరు వార్డులకు ఆరుగురు సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నుకోవటం జరిగిందన్నారు.. ఈ అరుగురితోపాటు ఒక కోశాధికారి, ఒక పాస్టర్, ముగ్గురు సభ్యులు కోఆప్షన్ ద్వారా మొత్తము పదకొండు మందితో పి.సి.సి నిర్మాణము ఎ.ఈ.ఎల్.సి కానిస్టిట్యూషన్ ప్రకారము జరిగిందని పాస్టర్ రెవ అక్కాబత్తుల సామ్యూల్ రాజు చెప్పారు.చర్చ్ అకౌంట్స్ 2018 నుంచి ఆడిట్ కు సంబంధించి కాలానుగుణంగా ఎ.ఈ.ఎల్.సి. ఆడిటర్ల డైరెక్షన్ ప్రకారము రొటీన్ లో జరుగుతోందని చెప్పారు.

ఎ.ఈ.ఎల్.సి నియమ నిబంధనలకు లోబడి – ప్రతీ సంవత్సరము – సువార్త పరిచర్యకై సువార్త ధన నిధి (ఎస్.డి.ఎన్) సంఘవిశ్వాసుల నుంచి స్వీకరించటానికి గడువు 31 డిశెంబరు కాగా తదుపరి సదరు సామ్ము ఎఈఎల్సీ గుంటూరు కేంద్ర కార్యాలయములో బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాధ్యులైన వారికి జమచేయవలసి ఉందన్నారు.సెయింట్ పీటర్స్ దేవాలయం విశ్వాసుల నుంచి స్వీకరించిన సువార్త ధన నిధి (ఎస్.డి.ఎన్)స్వాహా చేసినట్లుగా బాధ్యతా రాహిత్యంతో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంఘ సభ్యుల నుంచి సేకరించిన ఎస్.డి.ఎన్. సొమ్ము, సినడ్లో మిగిలిన సంఘాల నుంచి వచ్చిన సొమ్ము తోకలిపి అప్పటి ఎ.ఈ.ఎల్.సి కోశాధికారికి చెల్లించి సదరు మొత్తానికి వారినుంచి రశీదులు స్వీకరించటం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
20-3-22 వ తేదిన ఎఈఎల్సీ నిబంధనల ప్రకారం- సంఘ పారిష్ చర్చి కౌన్సిల్ నకు కోరమ్ లేకపోవడంతో పిసిసి రద్దుకాబడి అడహక్ కమిటీ నియమాకం సీనడ్ ఎగ్జిక్యూటివ్ అంగీకారంతో జరిగిందన్నారు.దాని పర్యవసానంగా పిసిసి సభ్యత్వం లేకపోవటంతో 20-3-22వ తేదీ వరకు సంఘ కార్యక్రమాలు, ఆరాధనలు సక్రమంగానే జరిగాయన్నారు.కానీ పి.సి.సి. సభ్యత్వం కోల్పోయి పదవీచ్యుతులు అయినప్పటి నుండి వర్ధనపు విక్టర్ సమాధానం, పిట్టా సుమన్, పెనుమాల శేఖర్ బాబు,నల్లి శ్యాంసన్ పదవి కోల్పోయిన అక్కసుతో తనపై నిందారోపణలువేసి దుష్ప్రచారం చేస్తున్నారని సామ్యూల్ రాజు విమర్శించారు. సంఘ విశ్వాసులు నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు.తనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని రెవ అక్కాబత్తుల సామ్యూల్ రాజు హితవు పలికారు. విలేకరుల సమావేశంలో అడహక్ కమిటీ పూర్వ కోశాధికారి ఎన్.ఎస్.జె.జె.ప్రకాష్ రాజు, డాక్టర్ టి.ఎస్.ప్రసాద్,వి.జె.కె.కుమార్ బాబు,డి.ఆశాలత,ఎస్.ఎ.జె.క్రిష్టోఫర్,బి.ఆనందరావు,ఎన్ షా.రాజు గ్లోరి,ఐ.ఎ.విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement