Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

జనసేన పార్టీ అగ్నికుల క్షత్రియుల సమస్యలపై బైక్ ర్యాలీ నిరసన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*జనసేన పార్టీ అగ్నికుల క్షత్రియుల సమస్యలపై బైక్ ర్యాలీ*

 

*భారీ సంఖ్యలో ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో అగ్నికుల క్షత్రియులు పాల్గొని నిరసన తెలిపారు*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ స్టాప్ ( ప్రతినిధి)

 

అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో అగ్నికుల క్షత్రియుల సమస్యలపై భారీ సంఖ్యలో విచ్చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కంద్ర దుర్గేష్ పిఏసి సభ్యులు పంతం నానాజీ రాష్ట్ర మత్స్య కార్ అభ్యున్నతి కమిటీ చైర్మన్ బొమ్మిడి నాయకర్ పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల బాబు పాల్గొన్నారు అమలాపురం నియోజకవర్గం పరిధిలోగల తీర ప్రాంతాలైనవాసాల తిప్ప, బోడస కుర్రు, రెబ్బనపల్లి,ఓడలరేవు, ప్రాంతాలలో నివసిస్తున్న అగ్నికుల క్షత్రియులు విపత్తుల సమయంలో వరద ముంపు కి గురవుతూ నానా కష్టాలు పడుతున్నారని అగ్నికుల క్షత్రియులు నివసించే ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన వరద ముంపుచర్యలు చేపట్టాలని, పక్కా ఇల్లు నిర్మించాలని అర్హులైన వారికి కూడా ఇల్లు నిర్మించాలని వరద ముంపుకు గురికాకుండా ఏటిగట్టు పటిష్టం రివిట్మెంట్లు చేయాలని.

 

ఓఎన్జిసి ,గెయిల్, కేయిరన్, వేదాంత వంటి ఆయిల్ సంస్థ ల వలన సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద అంతరించిపోతుందని, జీవనభృతి కోల్పోతున్నామని అగ్నికుర క్షత్రియ కుటుంబాలకు ఒక కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సముద్ర వేట విరామ సమయంలో ప్రతి అగ్నికుల క్షత్రియ కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలి మర పడవలు ఇంజిన్ నావలు వేటకు వెళ్లి జీవనోపాధి కొనసాగించే వారికి డీజిల్ పై సబ్సిడీ ఇవ్వాలని యువతకు చేపల వేటలో హాజరిక నైపుణ్యంతో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని ప్రతి మత్స్యకార గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని విద్యాభివృద్ధికి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఇన్ ల్యాండ్ ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీలు పునరుద్ధరించాలని గ్రామాలలో చెరువులు కాలువలు గుంటలలో మత్స్య సంపద వేటకు పూర్తిస్థాయిలో అగ్నికుల క్షత్రియులకు హక్కులు కల్పించాలి ఓఎన్జిసి, గైల్, వేదాంత వంటి సమరుత్పత్తుల సంస్థలలో స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

 

అగ్నికుల క్షత్రియుల జీవన భద్రత కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్ వద్ద నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు బైకులపై ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్లో సమస్యల పత్రాన్ని అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం వాసాల తిప్ప ఓడలరేవు బోడస్కుర్రు, రెబ్బన్ పల్లి గ్రామాల నుంచి భారీ సంఖ్యలో అగ్నికుల క్షత్రియులు మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!