Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 2:18 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 2:18 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 2:18 PM
Follow Us

ఎస్సీ ఎస్టీ అట్రాసిస్ట్ కేసులు నీరుగారుస్తున్న ఎస్ఐ సురేష్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరుగారుస్తున్న ఎస్ఐ సురేష్..

 

ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్న దళితులు…

 

అధికార దుర్వినియోగం పాల్పడిన ఎస్సై పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి…

 

మాదిగ ఆత్మగౌరవ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వల్లూరు నాని మాదిగ…

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:

ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు దాన్ని నీరుగారే ప్రయత్నం చేయడం పట్ల మాదిగ ఆత్మగౌరవ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వల్లూరి నాని మాదిగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన రాయవరం ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులపై అమానుషంగా ప్రవర్తిస్తున్న ఎస్సై పి.వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ పై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెల్లూరు కు చెందిన దళిత సామాజిక కేంద్రం బొడ్డపాటి రామారావుపై నిర్భయ చట్టం కింద అక్రమ కేసు బనాయించి వేధిస్తున్న ఎస్సై పై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్సై పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద ఆయన పేరు ఎస్సీ ఎలక్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిడిగట్ల వెంకట్రావు మాదిగ మాట్లాడుతూ మాట్లాడుతూ రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రాయవరం , సోమేశ్వరం , నదురుబాద , వెదురుపాక గ్రామాలకు చెందిన దళితుల కేసులు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్న రాయవరం ఎస్సై సురేష్ పై శాఖా పరమైన చర్యలు తీసుకోకపోతే రాయవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పట్ల దళిత సామాజి వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించాలన్నారు. ఎస్సై సురేష్ పై చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలిపిస్తామని వెంకట్రావు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement