Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

అంతర్జాతీయ శాంతి ఐకాన్ అవార్డుతో కుడుపూడి సత్యనారాయణ ( టీచర్ ) నుసత్కరించిన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

*అంతర్జాతీయ శాంతి ఐకాన్ అవార్డు తో కుడిపూడి సత్యనారాయణ (మాస్టర్)*నుసత్కరించిన*

 

*అంతర్జాతీయ యూనివర్సిటీ అవార్డు చైర్మన్ శాస్త్రవేత్త*

 

*ప్రొ: మధు క్రిషన్ చేతుల మీదుగా అవార్డు ప్రధానోత్సవం*

 

విశ్వం వాయిస్ న్యూస్ స్టాప్ ప్రతినిధి

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ పేరూరు గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ కుడుపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ కుడిపూడి వెంకన్న, నారాయణమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ప్రజలకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి సేవలను గుర్తించి అంతర్జాతీయ యూనివర్సిటీ అవార్డు చైర్మన్ శాస్త్రవేత్త (యూఎస్ఏ) డాక్టర్ మధు క్రిషన్ స్థిరవారం నాడు తమిళనాడు రాష్ట్రం చెన్నై టీ నగర్ సోషల్ క్లబ్లో అంతర్జాతీయ శాంతి ఐకాన్ అవార్డుతో ప్రొ మధు క్రిషన్ చేతుల మీదుగా ప్రధానం చేసి

సత్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మధు క్రిషన్ మాట్లాడుతూ కుడిపూడి సత్యనారాయణ రిటైర్డ్(మాస్టర్) ఉపాధ్యాయుడు

డ్రాయింగ్ మాస్టర్ గా కొనసాగుతూ గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేశారు. రోడ్డు ప్రక్కల బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యతను తీసుకున్నారు. 2020 వ సంవత్సరంలో కుడిపూడి వెంకన్న నారాయణమ్మ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి కరోనా సమయంలో అనేకమంది కుటుంబాలకు నిత్యవసర సరుకులు, వస్తువులు ఉచితంగా అందించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోను వరదలు, తుఫాన్లు సమయములో బాధితులకు ఆహార పదార్థాలు అందించారు. స్కూల్లో చదువుకునే పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందించడమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేసేవారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఆర్థికంగా మరియు మానసిక ధైర్యాన్ని ఇచ్చి సహాయం చేసేవారు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటికను బాగు చేయించి ప్రజలు వాడుకునేలా అభివృద్ధి పరిచారు ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా స్కూళ్లలో ఫ్రీగా పిల్లలకు డ్రాయింగ్ నేర్పించేవారు పేరూరు గ్రామపంచాయతీ వైస్ సర్పంచ్ గా కుడిపూడి సత్యనారాయణ ప్రతి ఇంటికి ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు ఉచితంగా అందిస్తున్నారు ఇలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయనను అంతర్జాతీయ యూనివర్సిటీ అవార్డు ( యూఎస్ఏ) అవార్డు ప్రధాన ఉత్సవంలో భాగంగా అంతర్జాతీయ శాంతి ఐకాన్ అవార్డు ప్రధానం చేసి సత్కరించిన ప్రొఫెసర్ మధు క్రిషన్ తెలియజేశారు

 

ఈ కార్యక్రమంలో పేరూరు గ్రామపంచాయతీ 8వ వార్డు సభ్యులు డేగల వెంకట్రామన్ రాఖి పామర్తి రాజబాబు ముత్యాల హరి సానబోయిన విజయకృష్ణ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!