Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 3:55 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 3:55 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 3:55 PM
Follow Us

నూతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ( దిశ) తొలి సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

నూతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ( దిశ )తొలి సమావేశం

 

 

అమలాపురం, విశ్వం వాయిస్ న్యూస్ :-

 

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలను విజ‌య‌వంతంగా అమ‌లుచేసేం దుకు స్థానిక సంస్థ‌ల ప్రజాప్ర‌తిని ధులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని, వివిధ ప్రభుత్వ ప‌థ‌కాల అమ‌లు అభివృద్ధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేలా కృషి చేయాలని బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్ర‌వారం స్థానిక కలెక్టరేట్ నందు నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) తొలి సమావేశం ఎంపీ చింతా అనురాధ అధ్యక్షతన నిర్వహిం చారు.ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింతా అనురాధ‌, ప్ర‌భుత్వ విప్ చిర్ల జ‌గ్గిరెడ్డి, శాసనసభ్యులు వి జోగేశ్వరరావు జెడ్‌పీ ఛైర్‌ప‌ర్స‌న్ విప్ప‌ర్తి వేణుగోపా ల‌రావు, జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొని కేంద్ర ప్ర‌భుత్వ ఆర్థిక తోడ్పాటుతో అమలు కాపాడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాల అమలు పురోగతి ప్రగతిని సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్బన్, గ్రామీణ్ , గృహ నిర్మాణాలు వైద్యం విద్య గ్రామీణ నీటి సరఫరా వ్యవసాయం సర్వ శిక్ష అభియాన్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, పారి శుద్ధ్యం, దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జాతీయ ఆరోగ్య మిష‌న్ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజన , చర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ టీచింగ్ హాస్పిటల్ ఆవశ్యకతపై చర్చించి, జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కోటి రూపాయలు కోనసీమ జిల్లాకు కేటాయించారని ఆ నిధులు రావడానికి కొంత సమయం పడుతుందని ఈ లోపుగా పార్లమెంట్ సభ్యుల నిధులు కేటాయించి స్పెషలైజేషన్ వైద్య సేవలు, డయాలసిస్ వైద్య సేవలు స్థానికంగా అందుబాటులో తెచ్చేందుకు కృషి జరుగుతుంద న్నారు. రామచంద్రపురం నియోజవర్గంలో వలస వెళ్లిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాదులో ప్రమాదం గురికావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మానవీ కోణంలో స్పందించి రూ.30 లక్షలు కేటాయించి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడం పట్ల ఆయన ముఖ్యమంత్రి కి బీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎంపీ అనురాధ మాట్లా డుతూ లేఅవుట్ల‌లో ఇళ్ల నిర్మాణాలు శ‌ర‌ వేగంగా జ‌రిగేందుకు ఇప్ప‌టికే అప్రోచ్ ర‌హ‌దారులు, అంత‌ర్గ‌త ర‌హ‌దారులు, విద్యుత్‌, నీరు త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల కల్పిస్తూ. ఇంకా ఏవైనా పెండింగ్ ప‌నులుంటే వెంట‌నే పూర్తిచేసి, ల‌బ్ధిదారుల‌ను ప్రోత్స‌హించి నిర్మాణాలు పూర్త‌ య్యేలా చూడాల‌ని ఎంపీ అధికా రులకు సూచించారు. ముఖ్యంగా ప్రసూతి డాక్ట‌ర్ల కొర‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిం చారు. గోరుముద్ద తదితర పోషకాహార లేమిని సరిదిద్దే స్కీములు మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రతి పథకంలో పూర్తి పారదర్శకత నాణ్యత ప్రమాణాలతో అమలు జరిగేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాలతో కూడిన గుణాత్మకమైన విద్యను బోధించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా స్వయం సహాయ సంఘాలను ఒక తాటిపై తెచ్చి బలోపేతం చేస్తూ పేద మహిళలు పేదరికాన్ని జయించే విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాల ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తిగా సద్వినియోగం పరుస్తూ అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో విద్యుత్ షాక్ తగిలి బాలుడు మరణించగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మానవతా దృక్పథంతో రూ 10 లక్షలు ఎక్స్ గ్రేసియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రులలో ఇటీవల కాలంలో సాధారణ ప్రసవానికి కూడా సిజేరియన్ చేస్తున్నారని ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఆరోగ్యశాఖ అధికారు లు పటిష్టమైన చర్యలు గైకొనాల న్నారు.ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ హి మాన్సు శుక్లా మాట్లాడుతూ పీహెచ్‌సీ స్థాయిలో ఆసుప‌త్రి అభివృద్ధి క‌మిటీల స‌మావేశాలు త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించి మెరుగైన వైద్య సేవలు కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. క్షేత్ర‌స్థాయిలో సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌ల్లో లోపాల‌ను తెలుసుకొని, త‌క్ష‌ణం స‌రిచేసేందుకు ఈ దిశ క‌మిటీ స‌మావేశం దోహదపడు తుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తెచ్చిన అంశాలను అదేవిధంగా వివిధ మండ‌లాల ఎంపీపీలు గృహ నిర్మాణం, ఆరోగ్యం త‌దిత‌రాల‌కు సంబంధించి స‌మావేశంలో పేర్కొన్న అంశాల‌ను ప‌రిశీలించి, ప‌రిష్క‌రిం చ‌డం జ‌రుగుతుంద‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ భ‌రోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు స్థానిక సంస్థల ప్రతిని ధులు తదితరులు హాజరయ్యారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement