Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,948
Total recovered
Updated on December 10, 2022 11:28 AM

ACTIVE

India
5,131
Total active cases
Updated on December 10, 2022 11:28 AM

DEATHS

India
530,654
Total deaths
Updated on December 10, 2022 11:28 AM

శ్రీ సత్యసాయి సేవ సంస్థల కృషి అభినందనీయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సత్యసాయి సేవా సంస్థల కృషి అభినందనీయం

– ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి

– వ్యాస రచన పోటీల విజేతలకు బహుమతి ప్రదానం 

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయం అని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం శ్రీ సత్యసాయి సేవా కేంద్రంలో బుధవారం ఇటీవల శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసారు. పాఠశాల నుంచి డిగ్రీ కళాశాల స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాలస్థాయిలో మమకారముల పెన్నిధి మా మాతృమూర్తి.. నా కృతజ్ఞతలు, జూనియర్ కళాశాల స్థాయిలో భారతీయ సంస్కృతి.. ప్రత్యేకత, డిగ్రీ కళాశాల స్థాయిలో నా జీవిత లక్ష్యము, తద్వారా దేశాభివృద్ధి అనే అంశాలపై వ్యాస రచన పోటీలు నిర్వహించామని, ప్రభుత్వ అనుమతి కూడా ఉందని వారు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 1,27,000 విద్యార్థులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాస్థాయిలో 6,052 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. 72 పాఠశాలలు, 14 జూనియర్ కళాశాలలు, 10 డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాఠశాల స్థాయిలో 5165 మంది, జూనియర్ కళాశాల స్థాయిలో 590 మంది, డిగ్రీ కళాశాల స్థాయిలో 297 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. జిల్లాలో మొత్తం 25 సత్యసాయి సేవాసమితుల పరిధిలో ఈ పోటీలు నిర్వహించబడ్డాయని, రావులపాలెం, గోపాలపురం గ్రామాల పరిధిలో 14 పాఠశాలలు, రెండు జూనియర్ కళాశాలలు, రెండు డిగ్రీ కళాశాలలకు చెందిన 1552 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, కర్రి వీర్రెడ్డి, కర్రి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల పరిషత్ అధ్యక్షులు కర్రీ లక్ష్మీ వెంకట నాగదేవి వీర్రెడ్డి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి,ఆర్.జె.డి.డాక్టర్ చప్పిడి కృష్ణ, సి.ఆర్.సి.కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా అధ్యక్షులు అడబాల కొండబాబు, కొవ్వూరు వివేకానందరెడ్డి, మన్యం పర్వత వర్ధనరావు, ఎస్.వి.ఎస్. రెడ్డి, నడింపల్లి రామకృష్ణంరాజు, ఒంటెద్దు బంగారయ్య, మేడపాటి విజయభాస్కర్ రెడ్డి, కొవ్వూరి బ్రహ్మరెడ్డి,చిర్ల వెంకటరెడ్డి,పెరవలి వెంకటేశ్వరరావు, చింతలపూడి రామభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!