Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 9:27 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 9:27 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 9:27 AM

12,13 తేదీల్లో రాష్ట్ర స్థాయి రోల్ బాల్ ఛాంపియన్ షిప్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

12 వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ పోటీలను కలెక్టర్ కె.మాధవీలత ప్రారంభిస్తారని, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ డి.ఎం.ఎం.శేషగిరి ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వి.ఎస్.కృష్ణ కిషోర్, ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు శివలింగ ప్రసాద్ హాజరవుతారని తెలిపారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

ఈ నెల 12,13 తేదీల్లో రాష్ట్ర స్థాయి రోల్ బాల్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టి.కె.విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.బొమ్మూరులో ఉన్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయన్నారు.రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ పోటీలను కలెక్టర్ కె.మాధవీలత ప్రారంభిస్తారని, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ డి.ఎం.ఎం.శేషగిరి ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వి.ఎస్.కృష్ణ కిషోర్, ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు శివలింగ ప్రసాద్ హాజరవుతారని తెలిపారు.13 వ తేదీ సాయంత్రం ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఛాంపియన్ కు షీల్డ్ అందచేస్తారని చెప్పారు.కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్,రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ,రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి,ఎంపీ మార్గాని భరత్ రామ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొంటారని విశ్వేశ్వర రెడ్డి చెప్పారు.విలేకర్ల సమావేశంలో రాజమహేంద్రి విద్యాసంస్థల డైరెక్టర్ ఎల్. వి.రామిరెడ్డి పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!