Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:35 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:35 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:35 PM
Follow Us

గైట్ కాలేజీలో ఐక్యూ మూవీ టీం సందడి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విద్యార్థులు కేరింతల మధ్య ట్రైలర్ సాంగ్స్ రిలీజ్
– విద్యార్థుల పవర్ చూపించే చిత్రం ఐ క్యూ మూవీ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

స్థానిక రాజానగరం గైట్ ఇంజినీరింగ్ కళాశాల నందు బుధవారం సాయంత్రం సినీ నిర్మాతకే లక్ష్మిపతి సమర్పణ లో కె ఎల్ పి మూవీస్ బేనర్ లో నిర్మించిన “ఐ క్యూ” మూవీ టీమ్ ప్రమోషనల్ టూర్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, నిర్మాత కె లక్ష్మిపతి, రచయిత పాలూరి ఘటిక చలం, డైరెక్టర్ జీ ఎల్ బి శ్రీనివాస్ విచ్చేశారు. ముందుగా చినరాజప్ప, ప్రొడ్యూసర్ కే లక్ష్మిపతి,చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్, మొదట పాట, రెండవ పాట ను రచయిత ఘటికా చలం, కాలేజీ ప్రిన్సిపల్ ధనరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఐ క్యూ తెలుగు సినిమా ట్రైలర్ లాంచింగ్ మరియు పాటలు విడుదల చేయడం జరిగిందని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఈ సినిమాలో నటించిన నటీనటులు బాగా నటించారని,ఇటువంటి సందేశాత్మక చిత్రాలు విద్యార్థులకు బాగా ఆకట్టుకుంటాయన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్మీపతి మాట్లాడుతూ మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని ఈ సినిమా నెలాఖరులో విడుదల కాబోతున్నదని సినిమా పాటలు యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగిందని లక్షల్లో వ్యూస్ రావడం, విశేషాదరణ పొందటం చాలా సంతోషమని, ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం తిరుపతి నుండి కోస్తా ఆంధ్ర వరకు విద్యార్థుల మధ్యలో ప్రమోషన్ నిర్వహిస్తున్నామని ఈ సినిమా మరింత ప్రేక్షకుల ఆదరించాలి అన్నారు.హీరో సాయిచరణ్ మాట్లాడుతూ సినిమాలో యూత్ కావలసిన సాంగ్స్,ఫైట్స్ ఉన్నాయన్నారు.ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. చిత్రంలో అందరూ సీనియర్ నటులు సుమన్,సత్య ప్రకాష్,బెనర్జీ అలాగే చిత్రంలో లక్ష్మిపతి, మాజీ కలెక్టర్ గా పల్లె రఘునాథ్ తదితరులు నటించారన్నారు. మా చిత్రాన్ని ఆదరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కో డైరెక్టర్ దివాకర్, కధానాయిక పల్లవి, ట్రాన్సీ,సహనటులు గీతా సింగ్,మాళవిక,పద్మిని, కె ఎల్ పి మూవీస్ మేనేజర్ శీలం శ్రీనివాస్,గైట్ కాలేజ్ ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement