Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 4:26 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 4:26 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 4:26 AM
Follow Us

ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌కు అండగా నిలుస్తాం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

నూతన కార్యవర్గం అధ్యక్షులు పోసిన వీరేంద్రకుమార్‌, ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఆర్‌ చంద్రమూర్తి, కోశాధికారి ఎన్‌ సౌందర్య రాజన్‌లు ఇతర కార్యవర్గం ఎన్నిక.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

రాష్ట్రంలోని ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ ఫోటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అండగా నిలుస్తుందని నూతన కార్యవర్గం అధ్యక్షులు పోసిన వీరేంద్రకుమార్‌, ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఆర్‌ చంద్రమూర్తి, కోశాధికారి ఎన్‌ సౌందర్య రాజన్‌లు వెల్లడిరచారు.రాష్ట్రంలో ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌ అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఒకే అసోసియేషన్‌ కింద పనిచేసే విధంగా ఐక్యతకు కృషి చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం స్థానిక మోరంపూడి సబ్‌స్టేషన్‌ ఎదుట రోడ్డులో గల శ్రీరస్తు ఫంక్షన్‌ హాలులో శుక్రవారం ఘనంగా జరిగింది.ది గోదావరి ఫ్రొపెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అండ్‌ రిలేటెడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో ముఖ్య అతిధులుగా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కె హుస్సేన్‌, ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్‌, ఫొటో టెక్‌ అభిమన్యు రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ సెక్రటరీ సంజీవ్‌, ఆంధ్రప్రదేశ్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ ఆర్‌వి అప్పారావు, గౌరవ అధ్యక్షులు చంద్రరెడ్డి, అల్లు బాబి, వైస్‌ ఛైర్‌మెన్‌ చొక్క రాంబాబు, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె మాధవరావు,వి శ్యామ్‌, పి సాగర్‌ బాబు, జె ప్రభాకరరావు, ఎన్‌ త్రివిక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. నూతన అధ్యక్షులు వీరేంద్రకుమార్‌ మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌ సోదరులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సభ్యుల సంక్షేమానికి తన శాయశక్తులు పాటుపడతానన్నారు. రాష్ట్రంలో ఒకే అసోసియేషన్‌ గొడుగు కింద సభ్యులంతా చేరే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. వర్క్‌షాపులు, ఫొటో ఎగ్జిబిషన్‌లు నిర్వహణకు అవసరమైన ప్రోత్సాహాన్ని అదిస్తానన్నారు. వృత్తి నైపుణ్యం పెంచడానికి అవసరమైన వర్క్‌షాపులు నిర్వహిస్తామన్నారు. సభ్యులకు అండగా ఉండటానికి కుటుంబ భరోసా పధకం అమలు చేస్తామన్నారు. అసోసియేషన్‌ లేని మండలాలు, పట్టణాలలో వాటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ అన్‌ సీజన్‌లో జిల్లాలు, మండలాలు వారిగా వర్క్‌షాపులు నిర్వహించి వృత్తి నైపుణ్యం పెంపొందించుకునే విధంగా పాటుపడతామన్నారు. ఫొటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ది గోదావరి ఫ్రొపెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అండ్‌ రిలేటెడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కోని శ్రీను మాట్లాడుతూ సభ్యుల సమస్యలను రాష్ట్ర అసోసియేషన్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. యాపిల్‌ స్టూడియో యాపిల్‌, రైన్‌బో రమేష్‌ ఇతర పెద్దలు మాట్లాడుతూ అసోసియేషన్‌ సభ్యులందరినీ ఏకతాటిపై నడిపించి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని పలు సూచనలు, సలహాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అసోసియేషన్‌ నాయకులు,సభ్యులు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement