Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 11:33 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 11:33 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 11:33 AM
Follow Us

నవంబర్ 18న రాష్ట్ర గవర్నర్ రాజమహేంద్రవరం రాక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు నవంబర్ 18 శుక్రవారం రాజమహేంద్రవరం రానున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి, తదుపరి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనను పూర్తి స్థాయి లో విజయవంతం చేయడం కోసం అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకల్లో పాల్గొని సందేశం ఇవ్వడం జరుగుతుంది.నవంబర్ 18 ఉదయం గవర్నర్ విజయవాడ లోని రాజ్ భవన్ నుంచి ఉదయం 9.30 కి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం కు చేరుకుని అక్కడ నుంచి ఉ.10.00 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి ఉ.10.45 కు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్, రాజమహేంద్రవరం కు చేరుకుంటారు. అనంతరం ఉ.10.50 కు బయలుదేరి ఉ.11.00 గంటలకు మంజీరలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కి చేరుకుని, స్వల్ప విశ్రాంతి అనంతరం ఉ 11.20 కు బయలుదేరి ఉ.11.30 కి ఆనం కళా కేంద్రానికి చేరుకుంటారు.తదుపరి ఉ.11.30 నుంచి మ.12.30 వరకు “జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ ” ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. తిరిగి కార్యక్రమం అనంతరం అక్కడ నుంచి బయలుదేరి మ.12.40 కి మంజీర ప్రవేట్ అతిధి గృహానికి చేరుకుని స్వల్ప విరామం తర్వాత మ.12.55 కి బయలుదేరి ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ కి చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మ.1.00 కు విజయవాడ కు బయలుదేరి వెళతారు.

.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement