Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,948
Total recovered
Updated on December 10, 2022 11:28 AM

ACTIVE

India
5,131
Total active cases
Updated on December 10, 2022 11:28 AM

DEATHS

India
530,654
Total deaths
Updated on December 10, 2022 11:28 AM

ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*ఘనంగా ప్రపంచ మత్స్య కార దినోత్సవ వేడుకలు*

 

 

ముమ్మిడివరం నవంబర్ 21 విశ్వ వాయిస్

మత్స్య సంపదను సముద్రంలోనూ మిగతా నీటి వనరుల లోను పెంచుకుంటూ మత్స్యకారులు సుస్థిర జీవనోపాదులు ఎలా పెంపొందించుకోవాలన్న అంశంపై నిర్దిష్టమైన ఫలదాయకమైన చర్చలు జరగాలని సదుద్దేశంతో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ప్రకటించారని *జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్* తెలిపారు*.

 

సోమవారం మండల పరిధిలోని కొమనాపల్లి గ్రామంలో వీడిఆర్ నగర లేఔట్ నందు స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా ఓఎన్జిసి గౌతమి గోదావరి నదికి అడ్డంగా సముద్ర ముఖద్వారం చమురు నిక్షేపాల అన్వేషణలో భాగంగా డ్రెడ్జింగ్ మరియు పైప్ లైన్ వేయడం వల్ల ప్రభావితమైన మత్స్యకారులకు జి ఎస్ పి సి పరిహారం కోసం గతంలో ఆమోదించిన 8 మండలాల్లోని అనగా ఐ.పోలవరం, అయినవిల్లి, కె.గంగవరం, కపిలేశ్వ రపురం, కాట్రేనికోన, కొత్తపేట, ముమ్మిడివరం మరియు తాళ్లరేవు మండలంలకు సంబం mధించి మొత్తం 69 గ్రామాలకు చెందిన మత్స్యకారులకు చేపల వేటకు ఆటంకంగా ఉన్నందున నష్టపరి హారం చెల్లింపు కోసం ప్రభావిత గ్రామాలలో మొత్తం 16,408 మంది లబ్ధిదారులను తుది జాబితాగా పరిగణించి, వారికి నెలలో 25 రోజుల పాటు రోజుకు రూ.460/- చొప్పున నెలకు రూ.11,500/- తగిన పరిహారం చెల్లించడానికి అంగీకరించి మొదటి విడతలో అనగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్ మరియు మే 4 నెలలకు సంబం ధించి మొత్తం 16,408 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 75,47,68,000 డి.బి.టి. ద్వారా ది. 15.03.2022న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి లబ్దిదారుల ఖాతాకు నేరుగా జమ చేశారన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించుకుని రెండవ విడతగా జూన్, జులై, ఆగస్టు మరియు సెప్టెంబర్ 4 నెలలకు సంబంధించి మొత్తం 23 458 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క కుటుంబానికి రూ 46 వేలు చొప్పున’మొత్తం రూ. 107.90 కోట్లు డి.బి.టి. ద్వారా సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులచే వర్చువల్ విధానంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి డిబిటి ద్వారా లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేయుట జరిగినదన్నా రు. ఎటువంటి వివక్షకు అవినీతికి కావులేకుండా నేరుగా లబ్ధిదారులు ఖాతాకే జమ చేయడం ద్వారా పూర్తి పారదర్శకత తో పథకాలు అమలు చేస్తున్నామ న్నారు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 30 మిలియన్ల నుండి 60 మిలియన్లకు పైగా ప్రజలు లోతట్టు చేపల పెంపకంలో పాల్గొంటున్నారని, దాదాపు 50 శాతం మంది మహిళలు ఉన్నారని

ప్రపంచంలోని ఆహార ప్రోటీన్‌లో 25 శాతానికి పైగా చేపల ద్వారా అందించబడుతుందన్నారు మానవులు చేపలను ఎక్కువగా తింటారన్నారని .ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో ముఖ్యమైనది పర్యావరణ సుస్థిరతకు గుర్తుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆహారంలో చేపలు ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. సాంప్రదాయ సమాజాలు మరియు సంఘాలు ఫిషింగ్ వృత్తి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ ఆదాయం ఉన్న మత్స్య కారులు మరియు మత్స్య సంపద లో అవిశ్రాంతంగా పనిచేసి అవగా హన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజలకు జీవనోపాధి మరియు ఉపాధిని కల్పించడం తోపాటు పోషక భద్రతను అందించే ఆహార ఉత్పత్తిలో ముఖ్యమైన రంగమని, వ్యవసాయ ఎగుమతు లకు దోహదం చేస్తుందన్నారు సాహసమే ఊపిరిగా మత్స్యకారు లు చేపల వేటలో నిమగ్నం అవుతున్నారని తెలిపారు.

 

*రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్* వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రాధాన్యత మత్స్యకార రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అదేవిధంగా చేనేత పరిశ్రమ ఆదుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆయా రంగాలలో ఉన్న కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుం దని, కుల వృత్తులు సరిహద్దులు దాటి ఆధారపడి జీవిస్తున్న కొత్త ట్రెడిషన్ వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాకాల సీజన్లో పులస చేపలు ఎక్కువగా లభించేవని సముద్ర ,నదీ కాలుష్యాలు మూలంగా వీటి సంతతి ఒరిస్సా వైపుకు వెళుతున్నాయని దీని మూలంగా స్థానిక మత్స్యకారులకు జీవనభృతులు అంతంత మాత్రమే ఉంటున్నాయని ఓఎన్జిసి వారు చమురు నిక్షేపణలు అన్వేషణలో చేపట్టిన డ్రిడ్జింగ్ కార్యక్రమాల వల్ల ఉపాధిని కోల్పోయిన వారికి నష్టపరిహారాలు ఓఎన్జిసి, ప్రభుత్వపరంగా అందించడం జరుగుతుందన్నారు.ఈ నష్టపరిహారాలను కూడా పెంచాల్సినఅవసరం ఉందని ఆయన ఓఎంజిసి ఉన్నతా ధికారులను ఈ సందర్భంగా కోరారు.

 

*ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్* మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఓఎన్జిసి ద్వారా నష్టపరిహారాలు చెల్లించిన సంఘటనలు లేవని కానీ ప్రభుత్వ చొరవతో గతంలో ఓఎన్జిసి బకాయి పడ్డ నష్టపరిహారాలు రూ.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం జరిగిందని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి ఔదార్యంతో మత్స్యకా రులకున్నీళ్లు తుడుస్తున్నానని తెలిపారు ప్రాణాలకు సహితం తెగించి పట్టుకునే పులస చేపలు నేడు సముద్రంలో అంతగా లేవని దిశ మార్చుకున్నాయని తెలిపారు. ప్రస్తుత తరం కంటే రాబోయే తరంలో మత్స్యకారుల జీవనభృ తులు మరియు సంఘాల వేట కార్యకలాపాలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు దీనికి తోడు మత్స్య సంపద అంతరిం చిపోతుందని ఆయన స్పష్టం చేశారు ఇటీవల గ్రామాల్లో సంచరిం చినప్పుడు మత్స్యకార గ్రామాలలో దయనీయమైన పరిస్థితులను చూడడం జరిగిందని మత్స్య కారులు ఆసుపత్రిలో ఇటుక బట్టీల్లో వలసలు వెళ్లి పనిచేయాల్సిన దుస్థితి నెలకొంటున్న నేపథ్యంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొంతవరకు వారి జీవనోపాదులు పెంపుకు దోహదపడతాయన్నారు. సముద్రము నదీ జలాలు కాలుష్యం మూలంగానే మత్స్య సంపద అంతరించిపోవడానికి ప్రధాన కారణంగా అని పేర్కొన్నారు. మత్స్యకారుల తరఫున తాను సీఎంకు ఎన్నడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు గతంలో నాలుగు వేలు ఉండే మత్స్యకార భరోసాని ఇప్పుడు పదివేలు చేయడం అదేవిధంగా ఆరు రూపాయలు ఉండే రూపాయలు డీజిల్ రాయితీని తొమ్మిది రూపాయలకు పెంచడం , వలసలు నివారణకు 11 హర్బర్లు ఒక మత్స్యకార యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే 10 లక్షలు పరిహారం అందించడం జరుగుతుందన్నారు చమురు సంస్థల ద్వారా మత్స్య కారుల వేటకు ఆటంకం కలిగినం దున దబదపాలుగా కోట్లాది రూపాయలు వారికి పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. జలజీవన్ మిషన్ ఓఎన్జిసి ద్వారా సుమారు 100 కోట్ల సమీకరించి నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి రానున్న 25 సంవత్సరాలలో తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా పక్కాగా చర్యలు చేపట్టామన్నారు. ఐ పోలవరం మండలం బైరవపాలెం చెందిన రేవు దుర్గాభవాని ,కొల్లేటి నారాయణమ్మ ప్రభుత్వ పథకాల అందుతున్న తీరుపట్ల తమ స్పందనను సభలో వెల్లడించారు.

 

ఈ కార్యక్ర మంలో జిల్లా పరిషత్ చైర్మన్ వి. వేణుగోపాలరావు,పి గన్నవరం శాసనసభ్యులు కే చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్లు ధ్యానచంద్ర, ఎస్ ఇలాకియా, ఓఎన్జిసి జిజిఎం రవిచంద్రన్, హెచ్ ఆర్ డి.మల్లిక్ సిహెచ్ శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడి షేక్ లాల్ మహమ్మద్, అసిస్టెంట్ కలెక్టర్ సుభాష్ జైన్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!