Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

ఆర్థిక ఇబ్బందులు ****** “వివాహిత ఆత్మహత్య

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

ఆర్ధిక ఇబ్బందులు…

వివాహిత ఆత్మహత్య…

 

మండపేట:- ఇద్దరు కుమార్తెలు, కూలి పనులు చేసుకొని జీవించడం, భర్త పనులకు వెళ్లకుండా ఉండడం… ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడం… ఆపై అనారోగ్య సమస్యలు వెన్నడం తో వివాహిత జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య కు పాల్పడ్డ ఘటన మండపేట లో చోటు చేసుకుంది. టౌన్ ఎస్ ఐ మద్దాల అశోక్ తెలిసిన వివరాలు ప్రకారం మండపేట గొల్లపుంత వైఎస్సార్ కాలని లోని ఇందిరమ్మ ఇళ్ళు ప్లాట్ 430 లో తొనంగి మురళి, తొనంగి లోవ(కుమారి)(30) లు జీవిస్తున్నారు. మురళి తో ఈమె కు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యిరు మండలం చిడిపాలెం పంచాయతీ పరిధిలోని సింగవరం కు చెందిన లోవ కు మండపేట కు మురళి కి పెళ్లికాగా వీరికి 13 ఏళ్ల బాల సరస్వతి,8 ఏళ్ళు గల మహాలక్ష్మి లు అనే ఇద్దరు కుమార్తె లు వున్నారు.భార్య భర్తలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్త పనికి వెళ్లడం లేదని దీంతో అప్పులు పెరిగిపోయాయని ఆమె వాపోయేది. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్యలు ఎదురుకావడంతో నిరాశ నిస్పృహ తో జీవితం పై విరక్తి చెందిన లోవ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ తెలిపారు. కాగా తన కుమార్తె ఆత్మహత్య సమాచారం అందుకున్న తండ్రి  మురుకుర్తి నాగ రాజు మండపేట విచ్చేసి కుమార్తె మృతి పై అనుమానం వ్యక్తం చేశారు. తన అల్లుడే హత్య చేసి ఆత్మహత్య గా చెబుతున్నడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహం ను బంధువులకు అప్పగించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!