Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 5:38 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 5:38 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 5:38 PM
Follow Us

ఏరియా ఆసుపత్రి ని పరిశీలించిన జెసి ధ్యాన్ చంద్ర

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన జెసి ధ్యాన్ చంద్ర*

 

*ఆసుపత్రిలో అల్పాహారం మూడు పూటలా సరఫరా చేయాలని సూచించిన జేసి*

 

 

*ఆసుపత్రిలో భోజనం సరఫరా చేసే గుత్తేదారుడుకు*

 

*కలెక్టర్ ఆదేశాల మేరకు పెండింగ్ బిల్లులు చెల్లింపు*

 

అమలాపురం నవంబర్ 23 విశ్వం వాయిస్

 

 

: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత కొంతకాలంగా 11 ఆసుపత్రు లలో అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం సరఫరా చేసే గుత్తేదారులకు పెండింగ్ బకాయిల ను జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదించి చెల్లించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు భోజన ఏర్పాట్లు, ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు సరళిని, పరిసరాల పరిశుభ్రత వంటశాల ప్రసూతి విభాగం వార్డులలో రోగులు ఏఏ రోగాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారన్న విషయాలపై ఆరా తీశారు. భోజనం తాజాగా వండి వడ్డిస్తున్నది లేనిది భుజించి రుచి నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. *ఈ సందర్భంగాజేసీ ధ్యాన్ చంద్ర* *రోగులకుభోజనాన్ని* *వడ్డించారు* గుత్తేదారుడు రూపేషుకు రోజు ఇదేవిధంగా మూడు పూటలా అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనాలు సరఫరా చేయాలని సూచించారు. భోజనం ఏర్పాట్లుకు సంబంధించిన గుత్తేదారులు నిరంతరాయంగా రోగులకు ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాట్లు కొనసా గించాలని ఆయన సూచించారు నిర్దేశిత మెనూ ప్రకారం ఆహార పదార్థాలు తయారు చేసి రోగులకు తాజాగా సరఫరా చేయాలన్నారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు పెండింగ్ బకాయిలు రూ.13 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు. రోగులను వారి బంధువులను ఆయన ఆప్యాయంగా పలకరించి ఏఏ వ్యాధులు మూలంగా ఎంత కాలంగా ఆసుపత్రిలో ఉంటున్నది ఆరా తీశారు ఆసుపత్రి స్థితిగతులపై ఆరా తీసి వార్డులలో చికిత్సలు పొందుతున్న వారిని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడుప్రత్యేకదృష్టి సారించి డెలివరీ తేదీలు ముందుగా ప్రకటి స్తూ తదనుగుణంగా సుఖప్రసవాలు నిర్వహించుకునేలా తోడ్పాటు నందించాలన్నారు. రక్త నిధి కేంద్రం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తానందించి పునర్జన్మను ప్రసాదించాలని ఆయన వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రి పరిసర వాతావరణాన్ని మరుగు దొడ్లు వంటశాల నిర్వహణను నిశితంగా పరిశీలించారు. పారిశుద్ధ్య వ్యవ స్థను మెరుగుపరచాలని వంటశా లలో వార్డులలో పనికిరాని వస్తువు లు ఉండకుండా జాగ్రత్తలు మెలకు వలు పాటించాలన్నారు. ప్రతి రూములో డస్ట్ బిన్నులు లేకుండా ఒక ఫ్లోర్ కు ఒకే చోట పెద్దగా డస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ ను బలోపేతం చేస్తూ పర్యావరణ పరంగా పరిసరాల పరిశుభ్రతను పాటిం చాలన్నారు. ఆసుపత్రుల పర్యవేక్ష ణ అధికారులు మండల తాసిల్దార్లు సమన్వయంతో ఆసుపత్రులలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు గైకొనాలని ఆదేశించడం జరిగిందన్నారు. వంటశాల నిర్వహణను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారిని పద్మశ్రీ రాణి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ని సి హెచ్ వి భరత లక్ష్మి ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ శంకర్రావు గైనకాలజిస్ట్ లు డాక్టర్ మౌనిక డాక్టర్ ఆర్. సుప్రియ స్థానిక తహసిల్దార్ పి శ్రీ పల్లవి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement