Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎం.డి.ఆలంఖాన్ జయంతి లో ప్రియదర్శిని చెవిటి,మూగ పాఠశాల పిల్లలకు భోజన వితరణ చేసిన మిత్ర బృందం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పాఠశాలకు రెండు స్టీల్ హాట్ బాక్సులు అందచేసిన కరీంఖాన్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు ఎం.డి.కరీంఖాన్ కుమారుడు ఆలంఖాన్ జయంతిని పురస్కరించుకుని అతని మిత్ర బృందం స్థానిక ప్రియదర్శిని చెవిటి,మూగ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం రాత్రి భోజన వితరణ చేశారు.ఆలంఖాన్ మిత్రులు 7 వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌస్, దానవాయిపేట మసీదు కార్యదర్శి ఆల్తాఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఆలంఖాన్ తండ్రి కరీంఖాన్, సోదరుడు ఎం.డి.ఇద్రీస్ ఖాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఆకస్మికంగా మృతి చెందిన తన కుమారుడు ఆలంఖాన్ ను ఈ పసిపిల్లల్లో చూసుకునేందుకు కరీంఖాన్ ఇలాంటి సేవాకార్యక్రమాలు చేపట్టడుతున్నారన్నారు. ఆలంఖాన్ మిత్ర బృందం ఏటా ఈ పిల్లలకు భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయ మన్నారు.కరీంఖాన్ మాట్లాడుతూ 2017లో కలకత్తా వెళ్ళి తమ వ్యాపారానికి సంబంధించిన దుస్తులు కొనుగోలు చేసి వస్తున్న తన చిన్న కుమారుడు ఆలంఖాన్ ఫుడ్ పాయిజన్ వల్ల కడుపు నొప్పితో సామర్లకోట రైల్వే స్టేషన్లో కుప్పకూలి తమకు దూరమైపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు.అప్పటినుంచి తన కుమారుడికి భగవంతుడు సద్గతులు కలగచేయాలని ఇలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలంఖాన్ జ్ఞాపకార్థం గతంలో రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశామని,ఈ ఏడాది రెండు స్టీల్ హాట్ బాక్సులు ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాల విద్యార్థుల కోసం అందచేస్తున్నామని చెప్పారు.ఆలంఖాన్ మిత్ర బృందం గౌస్,ఆల్తాఫ్ తదితరులు తమ స్నేహితుడిపై ఉన్న అభిమానంతో ఐదేళ్ళుగా ఏటా ఇలా భోజన వితరణ చేస్తున్నారని వారిని అభినందించారు.తొలుత దానవాయిపేట మసీదు ఇమామ్ ప్రార్థన చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement