Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 8:55 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 8:55 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 8:55 PM
Follow Us

రైతన్నకు తీరని కష్టం…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రైతన్నకు తీరని కష్టం…
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలి..
రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:

భారీ వర్షాలు కారణంగా జిల్లా అంతటా పంటచేలు నీటమునిగాయి.. కళ్ళాలులో ఉన్న ధాన్యం తడిసిపోయింది..

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా, సకాలంలో రైతు నుండి ధాన్యం కొనుగోలు చేయలేకపోవడంతో, కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోయి ఇప్పుడు నీటి పాలు అయింది, ఆ నీట మునిగిన ధాన్యాన్ని వానపల్లి పొలాల్లోని కళ్లాలకు వెళ్లి రైతుల యొక్క గోడును విని, ఈ ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు తీవ్ర నష్టం గురవుతున్నారని, నష్టపోయిన రైతులను తక్షణమే అందుకొని ధాన్యం కోనుగోళ్ళు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బండారు డిమాండ్ చేశారు.

*ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి*. రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి..

*గ్రామాల్లో అడుగంటిన పారిశుధ్యం.. వ్యాపిస్తున్న అంటూ వ్యాధులు.*..

గత కొంతకాలంగా పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుండటంతో నిధులు లేక పంచాయతీలు అల్లాడుతున్నాయి.. అకాల వర్షాలు, అపారశుధ్యం కారణంగా గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనే స్తోమత లేక పంచాయతీలు ముగ్గుతోనే సరిపెడుతున్నాయి..

*గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.. పీహేచ్సీ లకు సరిపడా మందులు ప్రభుత్వం అందించాలి*.

సత్వరమే పారిశుధ్యం మెరుగుపరిచే చర్యలు చేపట్టడానికి అనుగుణంగా ప్రభుత్వం పంచాయతీలకు నిధులు అందించాలని కోరుతున్నాం..

 

*బండారు సత్యానందరావు*రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు*

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement