విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
**మూడు చక్రాల ఇంధన వాహనం, టీవీఎస్ కంపెనీ ఉచితంగా పంపిణీ*
*
*జిల్లాకు 70 విభిన్న వికలాంగులకు*
*జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర తెలిపారు*
అమలాపురం డిసెంబర్ 16: విశ్వం వాయిస్
విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో ఎముకల సంబంధిత వికలాంగుల కొరకు జిల్లాకు 70 మూడు చక్రాల ఇంధన ఆధారిత టీవీఎస్ కంపెనీ మోటారు సైకిళ్లు ఉచితంగా పంపిణీకై కేటాయించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక బిఆర్ అంబేద్కర్ భవన్లో వికలాంగుల ధ్రువపత్రాల పరిశీలన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టామన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎముకల సంబంధిత వైకల్యాలున్న వ్యక్తుల కోసం మూడు చక్రాల రీట్రోఫిట్ చేయబడిన మోటారు వాహనాల ఉచిత పంపిణీ కై వికలాంగ లబ్ధిదారులను రిజర్వేషన్లు కార్యాచరణ మార్గదర్శకాలను లక్ష్యాలను అనుసరించి పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ సహాయ సంచాలకులు వాడ్రేవు కామరాజు మాట్లాడుతూ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నుండి రెట్రోఫిట్ చేయబడిన మోటార్ వాహనాల పంపిణీకై అప్లికేషన్లను డౌన్లోడ్ చేయడం ధృవీకరణను పూర్తిచేసి లబ్ధిదారులకు ఉచితంగా మూడు చక్రాల సైకిల్ పంపిణీ నిర్వహించడం జరుగుతోoదన్నారు ఎంపిక కాబడిన అభ్యర్థి గతంలో ఏదైనా వాహనం కలిగి ఉన్నారో లేదో ధృవీ కరించడానికి ఆర్టిఏ తో క్రాస్ చెకింగ్ ను నిర్వహించామన్నారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ప్రకారం పంపిణీ జరుగుతుందన్నారు . కృత్రిమ అవయవాలు, వాడుతున్న వారు రెండు కాళ్లలో వైకల్యం ఉన్నవారు అర్హులన్నారు.
ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి , జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి జీవి సత్యవాణి ప్రాంతీయ రవాణా అధికారి అశోక్ ప్రసాద్ , విబిన్న ప్రతిభావంతులు వయోవృ ద్ధుల సహాయ సంస్థ పునరావాసాధికారి వై శ్రీను, సీనియర్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.