Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 4:38 PM

ACTIVE

India
44,500,353
Total active cases
Updated on March 28, 2024 4:38 PM

DEATHS

India
533,540
Total deaths
Updated on March 28, 2024 4:38 PM
Follow Us

ఈనెల 19న చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత యువతి దీక్షకు సిద్ధం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి పోలీసుల కౌన్సిలింగ్ తో పెళ్లి చేసుకున్న రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వెలుగుబంటి వీరబాబు అనే యువకుడు అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన వెలుగుబంటి ముత్యాలమ్మ అలియాస్ దేవి అనే యువతిని సెప్టెంబర్ నెలలో చేబ్రోలు పోలీసుల కౌన్సిలింగ్ తో పెళ్లి చేసుకున్న సంగతి విధితమే

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:

  1. ఈనెల 19న చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత యువతి దీక్షకు సిద్ధం

– మహిళా సంఘాలు, మహిళా కమిషన్ మద్దతు కోరిన యువతి

రాజమహేంద్రవరం, ఆంధ్ర సింహం ప్రతినిధి:
ఒక యువకుడి చేతిలో లైంగిక దాడికి గురై తర్వాత తూ తూ మంత్రంగా పెళ్లితో ఒకటై భర్త, మరిది అత్తమామల బెదిరింపులతో పోలీసులు నిర్లక్ష వైఖరితో న్యాయం దక్కక గత్యంతరం లేని స్థితిలో బాదిత యువతి ఈనెల 19వ తేదీన సోమవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్షకు సిద్ధపడుతుంది. ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి పోలీసుల కౌన్సిలింగ్ తో పెళ్లి చేసుకున్న రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వెలుగుబంటి వీరబాబు అనే యువకుడు అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన వెలుగుబంటి ముత్యాలమ్మ అలియాస్ దేవి అనే యువతిని సెప్టెంబర్ నెలలో చేబ్రోలు పోలీసుల కౌన్సిలింగ్ తో పెళ్లి చేసుకున్న సంగతి విధితమే. ఉంగుటూరులో ఈ జంట కాపురం చేస్తుండగా వీరబాబు తల్లి ఎలుగుబంటి లోవలక్ష్మి అలియాస్ (బెల్టు షాపు లక్ష్మి) కొడుకు పై ఒత్తిడి తెచ్చి రెండో పెళ్లి చేస్తానని ముత్యాలమ్మ ని వదిలేసి రావాలని చెప్పడంతో అకస్మాత్తుగా ఉంగుటూరు నుంచి మాయమయ్యాడు. సుమారు పది రోజుల వేసి చూచిన తర్వాత వీరబాబు ఇంటికి వచ్చి విచారించిన ముత్యాలమ్మ ను వీరబాబు తమ్ముడు వెలుగుబంటి అమర ప్రభు, తల్లి లోవ లక్ష్మి, మామ బాబి లు కలిసి మూకుముడిగా ముత్యాలమ్మ పై భౌతిక దాడి చేసి దూషించి తీవ్రంగా గాయపరిచారు. దానితో ముత్యాలమ్మ తీవ్రంగా భయపడి తాడేపల్లిగూడెం చేరి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక తాడేపల్లిగూడెం పోలీసుల సమక్షంలో ఎమ్మెల్సీ కేసు నమోదు అయింది. ఈ కేసును చేబ్రోలు పోలీసులు సంఘటన జరిగిన బొమ్మూరు పోలీసులకు ఎమ్మెల్సీ కేసును బదిలీ చేశారు. గత మూడు నెలలుగా బాధిత యువతికి న్యాయం చేకూర్చడంలో బొమ్మూరు , చేబ్రోలు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రేమ పెళ్లి పేరుతో లైంగిక వాంచ తీర్చుకొని మొహం చాటేసిన తన భర్త ఎలుగుబంటి వీరబాబు, అతని తల్లిదండ్రులను పోలీసులు వెనకేసుకొస్తున్నారని వీరి మధ్య రాజీ కుదర్చడానికి ఒక న్యాయవాది చేత కేసు ఉపసంహరించుకోవాలని ఇచ్చినంత పుచ్చుకొని వెళ్లిపోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిందితులు బెదిరిస్తున్నారని, ఈ సంగతిని పోలీసువారికి చెప్తున్న వారు కూడా తమనే రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు కన్నీరు మున్నీరు అయ్యింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ గచ్చంతం లేని స్థితిలో న్యాయం కోరుతూ చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నానని తెలిపింది. తనకు జరిగిన అన్యాయానికి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మద్దతు ఇవ్వాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా నిందితులకు వత్తసు పలుకుతున్న పోలీసుల పై చర్య కోరుతూ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తానని బాధితురాలు తెలిపింది. గత నెలరోజుల నుంచి నిందితులనుంచి తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నాకు ప్రాణ రక్షణ కల్పించాలని ప్రస్తుతం తాను గర్భవతిని తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని పోలీసుఉన్నత అధికారులకు, మహిళ కమిషన్ ఆమె విజ్ఞప్తి చేసింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement