విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
క్రీస్తును అనుసరించడమే మోక్ష మార్గమని ప్రభువైన యేసుక్రీస్తు సంఘ కాపరి రెవరెండ్ పి.ఎం.రాజు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రే కొండబాబు, అడ్వికేట్ భావన రంగారావు, పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రేమ, త్యాగం ప్రపంచానికి అందించాడని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమన్నారు. పొరుగు వారిని ప్రేమించాలని, సాటివారిపట్ల దయ,ప్రేమతో మెలగాలని బోధించిన క్రీస్తు చూపించిన బాటలో అందరూ నడవాలన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రభువైన యేసుక్రీస్తు సంఘ కాపరి రెవరెండ్ పి.ఎం.రాజు సువార్త సందేశం అందించారు. క్రిస్మస్ వేడుకలు సందర్భంగా 100 మందికి వస్త్రాలు, చీరలు, 500 మందికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వితకారిణి సమాజం మాజీ చైర్మన్ దాసి వెంకటరావు, అవంతి డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ గుమ్మడి సమర్పణ రావు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కే . సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.