Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 9:48 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 9:48 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 9:48 AM
Follow Us

గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయ పలకరింపులో ఎంతో ఆనందం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

దుళ్ళ గ్రామంలో ఉన్న హైస్కూల్లో 1993-94 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.29 ఏళ్ళ తర్వాత బాల్య మిత్రులందరూ ఒకే చోట కలవడంతో చెప్పలేని ఆనందంతో గడిపారు.
గురువులు సన్మానం

విశ్వంవాయిస్ న్యూస్, కడియం:

 

రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుళ్ళ గ్రామంలో ఉన్న హైస్కూల్లో 1993-94 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.29 ఏళ్ళ తర్వాత బాల్య మిత్రులందరూ ఒకే చోట కలవడంతో చెప్పలేని ఆనందంతో గడిపారు. గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎం.శంకర్రావు, యం.అనంతశాస్త్రి,వై.విజయ కుమార్, డి.శివరామకృష్ణ,జి.అబ్రహం,టి.సుబ్బలక్ష్మి, యం.విజయ కుమారి, వి.సంతోషమ్మ మాట్లాడుతూ తమ వద్ద విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే తమకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థులు ఉన్నతని తెలుపుతుంటే తమకు చాలా సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.అప్పట్లో గురువులు చూపిన సన్మార్గంలో నడచి ప్రస్తుతం ప్రతి విద్యార్థి వివిధ వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు చూపించిన ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అనంతరం గురువులను విద్యార్థులు సన్మానించారు. సాయంత్రం వరకు ఆటపాటలతో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement