Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,160,997
Total recovered
Updated on March 24, 2023 5:18 AM

ACTIVE

India
7,605
Total active cases
Updated on March 24, 2023 5:18 AM

DEATHS

India
530,816
Total deaths
Updated on March 24, 2023 5:18 AM

బహిరంగసభలకు ఉపయోగపడే బీటా 3 సౌండ్ సిస్టమ్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణ సమితి కల్యాణ మండపంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బీటా 3 సౌండ్ సిస్టమ్ లైవ్ డెమో జరిగింది.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పాస్టర్లు,సౌండ్ సిస్టమ్స్ యజమానులు హాజరయ్యారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:

 

పదినుంచి ఇరవై వేలమంది కి పైగా హాజరయ్యే బహిరంగ సభలకు,క్రైసవ మహాసభలకు బీటా 3 సౌండ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సౌండ్ సిస్టమ్ సౌత్ ఇండియా పంపిణీ సంస్థ డెక్కన్ మ్యూజిక్ ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధులు చెప్పారు. గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణ సమితి కల్యాణ మండపంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బీటా 3 సౌండ్ సిస్టమ్ లైవ్ డెమో జరిగింది.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పాస్టర్లు,సౌండ్ సిస్టమ్స్ యజమానులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బీటా 3 సౌండ్ సిస్టమ్ సౌత్ ఇండియా పంపిణీ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఆడియో సిస్టమ్ మనకు కొత్త అయినప్పటికీ ఇప్పటికే సుమారు 80 నుంచి 100 దేశాల్లో బీటా 3 ఆడియో సౌండ్ సిస్టమ్ ప్రాచుర్యం పొందిందన్నారు.భారీ బహిరంగ సభలు జరిగినప్పుడు ఈ ఆడియో సిస్టమ్ అందరికీ స్పష్టంగా వినపడడానికి దోహదపడుతుందని చెప్పారు. వేలాదిగా జనం తరలివచ్చిన సభల్లో కూడా వక్తలు,ప్రసంగీకుల సందేశాలు చివర వరుసలో ఉన్న వారికి కూడా వినిపించేలా చేయడం బీటా 3 సౌండ్ సిస్టమ్ ప్రత్యేకత అని వివరించారు.తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఈ ఆడియో సౌండ్ సిస్టమ్ ను కొనుగోలు చేయడంవల్ల ప్రైవేటు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వారికి అద్దె రూపంలో త్వరితగతిన ఆదాయం సమకూరుతుందని చెప్పారు. శ్రీ సత్య సౌడ్ సిస్టమ్ అధినేత గుళ్ళిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ లైవ్ డెమో కార్యక్రమంలో సూర్య సప్లయ్ కంపెనీ అధినేత బొట్ల సూర్యారావు,మండపేటకు చెందిన సి.హెచ్.రాజు, జిల్లా లోని వివిధ ప్రైవేట్ సౌండ్ సిస్టమ్స్ యజమానులు, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!