విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్లరేవు జాతీయ రహదారిలో సోమవారం ఉదయం పశ్చిమ బెంగాల్ కి చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఆల్ ఇండియా కపుల్ టూర్ పేరుతో సైకిల్ యాత్రతో తాళ్ళరేవు చేరుకున్నారు. వారిని విశ్వం వాయిస్ వివరణ కోరగా తాము తమ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారుమని ప్రదీప్ దేవనాద్ ,సంగీత దేవనాద్ తెలిపారు. భారతదేశమంతా చుట్టూ తిరిగి రావాలనే ఆకాంక్షతో అక్టోబర్ 27న సైకిల్ యాత్ర ప్రారంభంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఆ ప్రాంతాలలో ఉండే ప్రముఖ దేవాలయాలు మరియు పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ ముందుకు సాగిస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మాట్లాడే భాష ఆచార విషయాలు సంస్కృతి సాంప్రదాయాలను చిత్రీకరిస్తూ వాటి వివరాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామని ప్రదీప్ దేవనాద్ తెలిపారు. వీరిని గమనించిన స్థానికులు ఈరోజుల్లో సైకిల్ యాత్ర ప్రారంభించడం అది భారతదేశ వ్యాప్తంగా యాత్ర చేయడం గొప్ప విషయమని దంపతులను అభినందించారు. ఆస్తులు సంపాదన కన్నా మానసిక ఆనందం కోసం చాలామంది దేశవ్యాప్త యాత్రలు చేస్తుంటారు. కానీ ఈ జంట భిన్నంగా పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా సైకిల్ని ఎంచుకొని యాత్రను కొనసాగిస్తున్నారని ప్రయాణికులు స్థానికులు అభినందించారు