విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో రవాణా శాఖ మంత్రి*
*జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న తండ్రి తనయుడు*
*దివ్యాంగుడుకు ట్రై సైకిల్ ఇంటి రిపేరుకు సిమెంటు బస్తాలు ప్రధాన రోడ్డు పనులు చేపడతామని హామీ ఇచ్చిన మంత్రి*
అమలాపురం రూరల్ జనవరి 31,
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు పథకాల ద్వారా లక్షిత వర్గాల వారికి ఏ మేరకు ప్రయోజనం చేకూరింది అదేవిధంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ తెలిపారు. బుధవారం మంత్రి రూరల్ మండలం పాలగుమ్మి ,చప్పిడి వారి పాలెం కంభంపాడు, పెద్ద పేట గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు లబ్ది ఏ మేరకు చేకూరింది గ్రామస్తుల అవసరాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడపగడపకు తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు చిట్టచివరి లబ్ధిదారుల వరకు అందుతున్నది లేనిది ఆరా తీశారు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాల మూలంగా సంక్షేమ లబ్ధిని పొందలేని లబ్ధిదారుల కొరకు సచివాలయంలో మరల దరఖాస్తు చేసుకుంటే వాటిని పునః పరిశీలించి అర్హులకు ఆరు నెలకొకసారి మరల అవకాశం కల్పించడం జరుగుతుం దని ఆయన స్పష్టం చేశారు. బొంతు శ్యామల అనే మహిళ తమ గృహం దెబ్బతిన్నదని రిపేర్ నిమిత్తం సహాయ అందించాలని కోరగా మంత్రి స్పందించి పది బస్తాలు సిమెంట్ ఉచితంగా ఇస్తానని ఆమెకు భరోసాను ఇచ్చారు. గ్రామంలో 50 సంవత్సరాలు వయసుగల దివ్యాంగుడు ట్రై సైకిల్ కావాలని మంత్రిని అభ్యర్థించగా ట్రైసైకిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పాలగుమ్మి గ్రామస్తులు తమ గ్రామానికి ప్రధాన రహదారి నిర్మించాలని ముక్తకంఠంతో కోరగా ప్రధాన రహదారి నిర్మాణానికి చర్యలు చేపడతామని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కంభంపాడు గ్రామంలో వీధులలోని విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో ఇళ్లకు కరెంటు సరఫరా కనెక్షన్ ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కావున స్తంభాలు దగ్గరగా వేయాలని గ్రామస్తులు కోరగా ఏపీ ట్రాన్స్కో అధికారుల ద్వారా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులతో మమైక సంక్షేమ పధకాలు అమలు జరుగుతున్న విధానం అడిగి తెలుసుకున్నారు . ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్నాలు వివిధ సంక్షేమ పథకాలు పట్ల గడపగడపకు తిరిగే సమయంలో లబ్ధిదారులు ఆనందాన్ని వెలిబుచ్చుతున్నా రన్నారు. పేదల సంక్షేమం కోసం నవరత్నాల కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి పేదవారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నా రు.రైతుల కోసం రైతు భరోసా, పేదవారికి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ, నాణ్యమైన చదువుల కోసం మనబడి నాడు నేడు ద్వారా పాఠశాలను కార్పొరేట్ దీటుగా ఆధునిక వసతులతో ఆధునీకరణ, చదువుకునే పిల్లల భవిష్యత్తు కొరకు అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద లాంటి పథకాలు సత్ ఫలితాలను ఇ స్తున్నాయన్నారు అదేవిధంగా ఇల్లు లేని వారికి గృహ నిర్మాణాలు, మహిళల కోసం ఆసరా, చేయూత లాంటి సంక్షేమ పథ కాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతున్నాయన్నారు. సమాజంలో పేదవారు సుస్థిర జీవనం గడిపేందుకు వీలుగా అవకాశాలు మెరుగు పడుతు న్నాయన్నారు గడప గడపకు పర్యటనలో భాగంగా పలువురు మహిళలు డ్రైనేజీ, ఎలక్ట్రిక్ లైన్, పెన్షన్ తదితర సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ పినిపే శ్రీకాంత్ , పాలగూమ్మి గ్రామ సర్పంచ్ కూడుపూడి రామలక్ష్మి,జడ్పీటీసీ పి. శ్రీ హరి గోపాల కృష్ణ, ఎంపీపీ కూడుపూడి భాగ్య లక్ష్మి, చెల్లుబోయిన శ్రీనివాసరావు,పార్టీ నాయకులు, గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.