విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
గోదావరిలోకి దూకిన యువకుడు – రక్షించిన స్థానికులు
మామిడికుదురు , విశ్వం వాయిస్ న్యూస్ :
పాశర్లపూడి- బోడసకుర్రు బ్రిడ్జి పై నుండి సోమవారం ఉదయం ఒక వ్యక్తి గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేశారు.నీళ్ళల్లో మునిగి పోతున్న ఆ వ్యక్తిని సమీపంలోనే వేటాడుకుంటున్న కొల్లు నాగకృష్ణ, రాకేష్ వర్మ,నాని ప్రాణాలకు తెగించి కాపాడి ఒడ్డుకు చేర్చి అతనికి సపర్యలు చేశారు. ఆత్మహత్య ప్రయత్నం చేసిన యువకుడు మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన నాగళ్ళ సత్తిబాబు గా గుర్తించిన స్థానిక అగ్నికుల క్షత్రియ యువకులు ఆ వ్యక్తిని నగరం ఎస్ ఐ షేక్ జానీ బాషా కు అప్పగించారు.