Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:35 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:35 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:35 PM
Follow Us

బడా యాత్ర ఏర్పాట్లపై పరిశీలన…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

నదీ ప్రాంగణాన్ని నిషితంగా పరిశీలించిన అధికారులు..

విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:

ఈ నెల 27 న జరగనున్న మన్నెంకొండ(శ్రీ ముత్యాలమ్మ తల్లి )జాతరకు విచ్చేయనున్న భక్తుల సౌకర్యలను ఉద్దేశించి,పొల్లూరు జలపాతాన్ని సందర్శించిన ఆంధ్ర &ఒరిస్సా అధికారులు…  ఈ సందర్భంగా సీలేరు&ఒరిస్సా నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా సంవత్సరకాలం లో పూర్తి చేస్తామని మల్కన్ గిరి సబ్ కలెక్టర్ తెలిపారు.

ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ ముత్యాలమ్మతల్లి(బడాయాత్ర)జాతర సందర్భంగా ఒరిస్సా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా సబ్ కలెక్టర్ అక్షయ్ కుమార్, అడిషనల్ ఎస్పి బలభద్ర, ఇంటెలిజెన్స్ డి.యస్.పి.జోధనల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జలపాతం వద్ద ఏర్పాట్లు, అలాగే సీలేరు నది వద్ద అమ్మవారు యాత్రలో పడవ దాటే ప్రాంగణాన్ని పరిశీలించి తగు సూచనలు సలహాలు తెలియజేసారు. ఈ వారంలో చింతూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయం లో సమావేశం ఏర్పాటు చేసి, ఆంధ్ర ప్రదేశ్ అధికారులతో మరియు ఎపిజెన్కో, పోలీస్ అధికారులతో మాట్లాడి తదుపరి జాతర ఏర్పాట్లు పై కార్యచరణ తెలియజేస్తామని తెలిపారు. తదనంతరం ఎం.పి.డి.ఒ రవిబాబు, సర్పంచ్ ఆకేటి సీత, సెక్రటరీ రవినాయక్ మోతుగూడెం, పొల్లూరు జాతర కమిటీ సభ్యులు, ఏ. పి. జెన్. కో ఉద్యోగులు వీళ్లకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మల్కన్ గిరి, కలిమెల తహశీల్దారులు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement