Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 8:55 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 8:55 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 8:55 PM
Follow Us

గృహ సారధులు జగనన్న ప్రభుత్వానికి రథ సారథులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జగనన్న ప్రభుత్వానికి గృహ సారధులు రథ సారథులు
– ఎటపాక జెడ్పీటిసీ ఉబ్బా సుస్మిత , ఎంపిపి కాక కామేశ్వరి
– ఎటపాకలో గృహ సారధులు , సచివాలయం కన్వీనర్ల సమావేశం

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక:

జగనన్న ప్రభుత్వానికి గృహ సారదులే రథ సారధులని , ప్రచార భాధ్యత గృహ సారదులదేనని పేర్కొంటూ గ్రామ వాలంటీర్లు , పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోని పని చేయాలని ఎటపాక జెడ్పిటిసి ఉబ్బా సుస్మిత , ఎంపిపి కాక కామేశ్వరి పేర్కొన్నారు. ఎటపాక మండల కేంద్రంలోని సచివాలయం ఆవరణలో మంగళవారం సచివాలయం కన్వీనర్ కురినాల వెంకట్ (బుజ్జి) అధ్యక్షతన గృహ సారదులు , సచివాలయం కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎటపాక జెడ్పిటిసి ఉబ్బా సుస్మిత , ఎంపిపి కాక కామేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చెప్పి మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భాధ్యత గృహ సారదులు , సచివాలయం కన్వీనర్లదేనని అన్నారు. కుల , మతాలు , రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని పేర్కొన్నారు. స్ధానిక నాయకులు , వాలంటీర్లు , సచివాలయం కన్వీనర్లను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎటపాక పంచాయతీ కార్యదర్శి పద్మావతి , సచివాలయం కన్వీనర్లు కొవ్వూరు రాంబాబు , పూనెం వీరస్వామి , గుండి లక్ష్మి , నాయకులు కాక వెంకట్ , గృహ సారదులు , ముఖ్య నాయకులు , మహిళలు , వైకాపా శ్రేణులు , వాలంటీర్లు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement