Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 7:05 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 7:05 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 7:05 AM
Follow Us

తాళ్ల తయారీకి అనాదికాలం నుండి పేరుగాంచిన తాళరేవు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ల తయారీకి అనాదికాలం నుండి పేరుగాంచిన తాళరేవు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ ప‌ట్ట‌ణానికి 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ గ్రామం నేడు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచింది. ఆ గ్రామం పేరు తాళ్ల‌రేవు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఎక్క‌డిక‌క్క‌డే జ‌రుగుతున్న ఉత్స‌వాల్లో స్వామి, అమ్మ‌వార్ల‌ను ర‌థంపై ఊరేగించ‌డం మ‌నం చూస్తుంటాం. ఇలా నిర్వ‌హించే ర‌థోత్స‌వాల్లో భారీ ర‌థాల‌ను లాగేందుకు ఉప‌యోగించే తాళ్ల త‌యారీఎక్క‌డ జ‌రుగుతుందో తెలుసా..అయితే మ‌నం ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే .

కాకినాడ ప‌ట్ట‌ణానికి 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ గ్రామం నేడు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచింది. ఆ గ్రామం పేరు తాళ్ల‌రేవు. నిజానికి ఆ ఊరికి ఆ పేరు ఏలా వ‌చ్చిందంటే కోన‌సీమకు వెళ్లే మార్గంలో ఈ గ్రామం తార‌స‌ప‌డుతుంది. ఇదే గ్రామంలో భారీగా కొబ్బ‌రి చెట్లు కూడా ఉంటాయి. కొబ్బ‌రి నుండి వ‌చ్చే పీచుతో కొబ్బ‌రి తాళ్లు త‌యారు చేస్తారు. కొబ్బ‌రి పీచును ఆరబెట్టి పోగు చేస్తారు. అలా కొబ్బ‌రి పీచును స‌న్న‌ని దారాల్లా చేసి అల్లుతారు.కేవ‌లం ఇక్క‌డ వారు మాత్రమే ఈ తాళ్ల‌ను అల్ల‌డంలో ప్ర‌సిద్ధి. పూర్వ‌కాలం నుండి ఇదే వృత్తి ఇక్క‌డ కొన‌సాగ‌డంతో తాళ్ల‌రేవుకు ఆపేరు వ‌చ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముడ‌వుతున్న తాళ్లు ఇక్క‌డ త‌యార‌వుతుంటాయి. కోన‌సీమ కొబ్బ‌రి ఆధారంగా కొబ్బ‌రి పీచుతో ద్వారా త‌యారు చేసే ఈతాళ్లు రాష్ట్రంలో న‌లుమూలల నుండి వ‌చ్చి వ‌ర్త‌క‌లు తీసుకెళ్తుంటారు. పెద్ద తాళ్లు, చిన్న‌తాళ్లు, మ‌ధ్య‌స్థ తాళ్లు ఇలా ప‌లు ర‌కాలైన తాళ్లను త‌యారు చేసి ఇత‌ర ప్రాంతాల‌కు ఎగుమ‌తి చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్క‌డ చేసిన తాళ్లు ర‌థాల‌ను లాగేంత పెద్ద‌వి కూడా ఉంటాయి. రాష్ట్రంలో ప్ర‌ధాన ఆల‌యాల్లో జ‌రిగే ర‌థోత్స‌వాల‌కు ర‌థాల‌ను లాగేందుకు ఇక్క‌డ నేచిన తాళ్ల‌నే తీసుకెళ్తుంటారు. తాజాగా మార్చి నెల‌లో జ‌రిగే స‌త్య‌సాయి జిల్లా క‌దిరి ల‌క్ష్మి న‌ర‌సింహాస్వామి ఉత్స‌వాల‌కు ఇక్క‌డ త‌యార‌వుతున్న తాడునే తీసుకెళ్తున్నారు. ట‌న్నుల కొద్ది బ‌రువు ఉండే ఈ తాడు త‌యారు చేయ‌డానికి కేవ‌లం ఇక్క‌డ ప్రాంతంలో కార్మికులే ప్ర‌సిద్ధి కావ‌డం ఇక్క‌డ విశేషం.70 మంది కార్మి కులు 640 కొబ్బరి తాళ్లతో, సుమారు 550 అడుగుల పొడవున 24 అంగుళాల చుట్టు కొలతతో ఈ తాడు తయారవుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవానికి వినియోగించే ఈ తాడును ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేస్తామని తాళ్ల తయారీ సంస్థ యాజమాని సామా సూర్య ప్రకాష్ తెలిపారు. వారం రోజుల పాటు తాడును త‌యారు చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. గ్రామంలో తాడు పేన‌డంలో నిమ‌గ్న‌మైన కార్మికుల‌చే ఇది తయార‌వుతోంది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement