వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థుల బృందం
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్ళరేవులో ఫారిన్ ట్రేడ్ విద్యార్థుల బృందం పర్యటన
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థుల బృందం
తాళ్లరేవు మండలంలోని చినబొడ్డు వెంకటాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విద్యార్థుల బృందం పర్యటించారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాఠశాలలో అమలవుతున్న విద్యా విధానం గురించి తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వం విచారంగం బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శనీయమని విద్యార్థుల బృందం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.