విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
తన జాతి వారికి శెట్టిబలిజిలుగా నామకరణం చేసి కీర్తి ప్రతిష్టలు చేకూర్చిన మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలు
ఘనంగా అమలాపురం హై స్కూల్ నందు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి 170వ జయంతి వేడుకలు
ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 170 జయంతి కార్యక్రమం స్థానిక హై స్కూల్ సెంటర్ శెట్టిబలిజ గ్రంథాలయంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో గురువారం జరిగింది.. శెట్టిబలిజ సంగీలు అధిక సంఖ్యలో పాల్గొని వెంకట్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి మాట్లాడుతూ ఐదు ఉప కులాలుగా ఉన్న వారిని శెట్టిబలిజిలుగా నామకరణం చేసి వారిని సంఘంలో పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి వెంకటరెడ్డి అని కొనియాడారు.. వైసిపి పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ సంసాని బుల్లినానీ మాట్లాడుతూ తరాలు మారిన శెట్టిబలిజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి వెంకటరెడ్డి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి సత్యనారాయణ.. చెల్లుబోయిన శ్రీనివాసరావు కుడిపూడి బాబు. గోపాల రాజేష్ . దొంగ చిన్న,బొంతు గోవిందు శెట్టి. బొక్క ఆదినారాయణ ఇళ్ల శేషారావు గుబ్బల బాబ్జి గుబ్బల మనోహర్. వాసంశెట్టి తాతాజీ. దoగేటి బాబ్జి, కేత భానుతేజ తదితరులు ఉన్నారు.