Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 12:44 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 12:44 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 12:44 PM
Follow Us

ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో అవగాహన కార్యక్రమాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

*ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని*

 

జిల్లాలోఅవగాహన కార్యక్రమాలు*

 

ఈనెల 24వ తేదీ నుండి ఒక రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య ఉప కేంద్రాలలో నిర్వహించనునట్లు

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు దొర పేర్కొన్నారు

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం మార్చి 23: క్షయ వ్యాధి నిర్మూలన పట్ల ఈనెల 24వ తేదీన ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూ లన దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలు ఈనెల 24 వ తేదీ నుండి 21 రోజులు పాటు ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య ఉప కేంద్రాలు లో నిర్వ హించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు దొర పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు ఆయన మరియు అదనపు డిఎంహెచ్వో క్షయ వ్యాధి నిర్మూలన అధికారిని సిహెచ్ వి భరత లక్ష్మి, పాత్రికేయ సమావేశం నిర్వహించి ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం కార్యక్రమాల వివరాలను విశ దీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షల ట్రునట్ మిషన్ కేంద్రాలు 11 ఉన్నాయని వీటిలో అమలాపురం ముమ్మిడివరం టీ కొత్తపల్లి పి గన్నవరం, రాజోలు ,ఊబలంక ఆలమూరు రామచంద్రపురం మండపేట లలో ఉన్నాయని అని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 7 ట్రీట్మెంట్ సెంటర్లు కలవని ప్రతి ట్రీట్మెంట్ యూనిట్లో పూర్తిస్థాయిలో సిబ్బంది వైద్య సేవలను అందిస్తార న్నారు. ఈ వైద్య పరీక్షల స్థితిగ తులను ని – క్షయ యాప్ లోఅప్లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు ప్రధానమంత్రి టీ.బి. ముక్తాభారత్ అభియాన్ క్షయ వ్యాధిగ్రస్తులకు ని – క్షయ యోజన ద్వారా ప్రతినెల 500 రూపాయలు ఆర్థిక సహాయంతో పౌష్టికాహారం నిమిత్తం అందించడం జరుగుతుందన్నారు క్షయ వ్యాధిని అంతం చేయడానికి సమాజాన్ని సమర్థవంతంగా దీనిలో నిమగ్నం చేయడం కోసం క్షయ వ్యాధిగ్రస్తుల కోరకు ప్రధానమంత్రి టీ.బి. ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నమోదు కాపాడిన స్వచ్ఛంద సంస్థలు సహకార సంస్థలు కార్పొరేట్లు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఇతర సంస్థలు ఒక వ్యాధిగ్రస్తులకు నెలకు 500 రూపాయలతో కూడిన ఫుడ్ బాస్కెట్ను రోగులకు కనీసం ఆరు నెలల పాటు ఇచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం 777 మంది సాధారణ క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని వీరిలో 33 మంది మొండి క్షయ రోగులు ఉన్నారని వీరికి ప్రత్యేక ట్రీట్మెంట్ కొనసాగుతోందన్నారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి క్షయ వ్యాధి నిర్మూలన అధికారిణి సిహెచ్ వి భరత్ లక్ష్మీ మాట్లాడుతూ ప్రధానమంత్రి టీ.బి. ముక్తా భారత్ అభియాన్ కింద జిల్లాలో 52 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు మూడు నెలల నుండి 103 ఫుడ్ బాస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టీ.బి.ని అంతం చేయగలమనే నినాద స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ప్రజల భాగస్వా మ్యంతో నిర్మూలన కార్యక్రమాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement