Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

దళిత ఐక్యత ఆధ్వర్యంలో ర్యాలీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

దళిత ఐక్యత ఆధ్వర్యంలో ర్యాలీ

నూతనంగా ఎన్నికైన ఎండియూడబ్ల్యూఏ అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్ళరేవు, విశ్వం వాయిస్ న్యూస్: తాళ్ళరేవు మండలంలోని తాళ్ళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు దళితుల ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నూతనంగా ఎన్నికైన ఎండియూడబ్ల్యూఏ అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో దళితులు ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తూ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ భవన్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, జిఎంసి బాలయోగి విగ్రహానికి, పివి రావు లకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దున్న జనార్దన్ రావు, రాయుడు గంగాధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనార్దన్ రావు జండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. తాళ్ళరేవు నుండి మొదలుకొని దళిత గ్రామాల వైపు పోలేకుర్రు తోటపేట పత్తి గుంది కోరంగి గ్రామాలను కలుపుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండలంలోని దళిత యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేసినందుకు నూతన అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ సాధనాల వెంకట శివరామకృష్ణ ,వెంకట రామకృష్ణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement