Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విద్యుత్ చార్జీల పెంపుపై తెలుగుదేశం నాయకులు నిరసన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, పి గన్నవరం:

విద్యుత్ చార్జీల పెంపుపై తెలుగుదేశం నాయకులు నిరసన

పి గన్నవరం విశ్వ వాయిస్ న్యూస్:
వైకాపా ప్రభుత్వం ఏం సాధించిందని ఇంటింటికి స్టిక్కర్లు వేసుకుంటున్నారు
పి.గన్నవరం
వైకాపా ప్రభుత్వం ఏం సాధించిందని సీఎం జగన్ ఇంటింటికి వారి పార్టీ నాయకులతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారని పి. గన్నవరం నియోజకవర్గ టిడిపి కోకన్వీనర్ నామన రాంబాబు ప్రశ్నించారు. ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపు పట్ల పి.గన్నవరం విద్యుత్ ఉపకేంద్రం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసర వస్తువులు, ధరలకు తోడు విద్యుత్ చార్జీలను సైతం వైకాపా ప్రభుత్వం పెంచడంతో ప్రజలు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారులకు టిడిపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం టిడిపి నాయకులతో కలిసి మా దరిద్రం నువ్వే జగన్ పేరిట టిడిపి నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు తోలేటి సత్తిబాబు, వైస్ ఎంపీపీ నేలపూడి దామోదర్, పి. గన్నవరం గ్రామ సర్పంచ్ బొండాడ నాగమణి, ఎంపీటీసీలు కోక్కిరి లక్ష్మి, పులపర్తి వెంకటలక్ష్మి, అవనిగడ్డ సత్తిబాబు, టిడిపి నాయకులు సంసాని పెద్దిరాజు, ఆరుమిల్లి లాల్ బాబు, పెదపూడి రాము, నక్క వీర వెంకట సత్యనారాయణ, పైడి బుజ్జి, గోగి రమేష్, మందపాటి కిరణ్ కుమార్, నారిన సత్తిపండు, సాధనాల ఎస్పీ, చీకట్ల రామకృష్ణ, శెరు శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement