Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మహిళ హత్యపై వీడిన మిస్టరీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:

కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు డిఎస్పి కె.వి రమణ తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి ఇందిరానగర్ కి చెందిన పాము లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆమె భర్త పాము కాసు గత నెల 22వ తారీఖున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో అనుమానితుడిగా వాడపాలెం గ్రామానికి చెందిన మీసాల ఏసును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారని డీఎస్పీ తెలిపారు. తానే ఈ హత్య చేసినట్లు మీసాలు ఏసు అంగీకరించాడన్నారు. గత పది సంవత్సరాలుగా పాము లక్ష్మితో తనకు అక్రమ సంబంధం ఉందని మీసాల ఏసు చెప్పాడన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతూ, వేరే వాళ్లతో చనువుగా ఉండడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకుని గత నెల 15వ తారీఖున మధ్యాహ్నం మీసాల యేసు గేదెలపాక వద్ద అరటి తోటలోకి ఆమెను పిలిచాడన్నారు. అంతకుముందే వేసుకున్న పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న తాడుతో పాము లక్ష్మి పీకచుట్టూ బిగించి చంపినట్లు మీసాల యేసు అంగీకరించాడని తెలిపారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో పాము లక్ష్మి శవాన్ని తీసుకుని వెళ్లి బండారు గంగరాజు మోటార్ బావిలో పడవేశాడన్నారు. అనంతరం బావిపై మూత వేసి ఏమి ఎరగనట్లు తిరిగి వచ్చేసినట్లు అతను అంగీకరించాడని డిఎస్పి వివరించారు. సదరు నేరంలో అతను ఉపయోగించిన తాడుని స్వాధీనం చేసుకుని, ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement