Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ లో ఎంపీపీ అధ్యక్షతన పదవ తరగతి విద్యార్థులకు సత్కారం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ లో ఎంపీపీ అధ్యక్షతన పదవ తరగతి విద్యార్థులకు సత్కారం

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎంపీపీ

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్ళరేవు మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మండల స్థాయి విద్యార్థులను ప్రథమ స్థానం సాధించిన మాధురి, ఇంజరం ప్రభుత్వ పాఠశాల హేమలత దేవి రెండవ స్థానంలో, నేలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన వెంకట దివ్య సంతోషిని మూడవ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను చదువులలో ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, చదువుకున్న స్కూలుకు గ్రామానికి మండలానికి రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా ముందుకు కొనసాగాలని అభినందించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణ జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ రాయుడు సునీత మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను బట్టి రైతులకు పంటలను శుభ్రం చేసుకునేందుకు సమయపాలన గమనించి రైతులు పంటలను సక్రమంగా దరి చేర్చుకోవాలని కోరారు. ఎందుకు సంబంధించిన వ్యవసాయ అధికారులను రైతుల వద్దకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement