Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పంట పొలాలకు రహదారి లేక ఇబ్బందులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పంట పొలాలకు రహదారి లేక ఇబ్బందులు

రైతుల పొలాలకు సరైన రహదారి నిర్మించాలని రైతులు డిమాండ్

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్ళరేవు మండల పరిధి పి మల్లవరం పంచాయతీ పరిధిలో ఉన్న పంట పొలాలు ఆక్వా చెరువులు కలిగిన భూముల్లో ఉన్న రహదారిని చదును చేసి గ్రావెల్ రూట్ ఏర్పాటు చేయాలని, ఈ గ్రావెల్ రోడ్డు లేనందువల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన చెందారు. సుమారుగా ఈ ప్రాంతంలో 200 ఎకరాల వరి పంట భూమి, 500 ఎకరాల ఆక్వా కల్చర్ చెరువులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో రైతులు వరి మాసూళ్లు చేసుకొని ఆ పంటను అమ్ముకునే పరిస్థితి వచ్చేవరకు రహదారి లేక దళారులకు వారు చెప్పిన రేటుకే ఇవ్వవలసి వస్తుందని వారి సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ అధికారులు నాయకులు స్పందించి రహదారిని నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం ఆక్వా రైతులు మాట్లాడుతూ చెరువులు వద్దకు వెళ్లడానికి సరైన మార్గం లేదని పి మల్లవరం పంచాయతీ పత్తి గుంది గ్రామం నుండి గ్రాంట్ వరకు ఉన్న పొంతను అభివృద్ధి చేసి గ్రావెల్ రోడ్డు వేయడానికి ప్రభుత్వం రైతులకు సహకరించాలని ఎన్నో ఏళ్లుగా ఈ పొంత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ పంటలు కొనసాగిస్తున్నామని, పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు పడడం సరైన మార్గం లేకపోవడం వల్ల కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వం వారు స్పందించి రాగలరు నిర్మాణం చేపట్టాలని గ్రామ సర్పంచ్ దున్న సత్యనారాయణకు స్థానిక రైతులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పి మల్లవరం గ్రామ రైతులు ఆక్వా చెరువుల రైతులు, కార్మిక సంఘం నాయకులు, మోర్తా వాడపల్లి, అగ్గి రాముడు, జయన్నారాయణ, పట్టా వెంకటరమణమూర్తి, ఎస్ వెంకట శివరామకృష్ణ, జువ్వల వెంకటస్వామి తదితరులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement