Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మహానాడుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చిన తెదేపా నేతలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మహానాడుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చిన తెదేపా నేతలు

తాళ్ళరేవులో తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడు కార్యక్రమం ఈనెల 27, 28 తేదీలలో జరుగుచున్న సమావేశానికి మహానాడుకు సంబంధించి మండల వారీగా గ్రామాల వారిగా కార్యకర్తలు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని మహానాడు కార్యక్రమాలను జయప్రదం చేయాలని తాళ్లరేవు పోలేకూరు ఎస్సీ సెల్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు మాట్లాడుతూ పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అని కార్యకర్త లేకుండా పార్టీ ముందుకు సాగడం ఆలోచించదగ్గ విషయం అని కార్యకర్తలు ఎంతో కృషిచేసి పార్టీ కొరకు పనులు మానుకుని వచ్చే నాయకులు ఉన్నారని కొనియాడారు. అందరూ కలిసికట్టుగా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని ఈ సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో పోలేకుర్రు నాయకులు సాధనాల వెంకట శివరామకృష్ణ, ఊడ వెంకట రామకృష్ణ, జనిపల్లి ఈశ్వరరావు, రేవు గోవరాజు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement