Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

స్నానానికి వెళ్లి మృత్యువాత పడిన విద్యార్థులు మట్లపాలెంలో జరిగిన ఘటన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

స్నానానికి వెళ్లి మృత్యువాత పడిన విద్యార్థులు
మట్లపాలెంలో జరిగిన ఘటన

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని మట్లపాలెం తుల్యభాగ గోదావరి నదిలో స్నానానికి దిగి ఒకరు మృత్యువాత పడ్డారు. స్థానిక కోరంగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వివరాలు ప్రకారం పల్నాడు జిల్లా వినుకొండ మండలం శృంగార వనానికి చెందిన కందుల సురేంద్ర, జగన్నాథం, ఆంజనేయులు, కుర్ర మూర్తి, గుమ్మల్ల రాధాకృష్ణ లు మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చారు. వీరు నలుగురు దర్శనం చేసుకుని అనంతరం సాయంకాలం సమయంలో తుల్యభాగ గోదావరి నదిలో స్నానానికి వెళ్లి వీరిలో స్నానం చేస్తుండగా సురేంద్ర నీటిలో కొంత దూరం వెళ్లి మునిగిపోసాగాడు. దీంతో ఒడ్డున స్నానం చేస్తున్న మిగతా ముగ్గురు స్నేహితులు దగ్గరగా కేకలు పెట్టగా స్థానికులు గమనించి నీటిలో మునిగిపోయిన సురేంద్ర ను బయటకు తీశారు. అప్పటికే సురేంద్ర మృతి చెందాడని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించినట్లు కోరంగి ఎస్సై పి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వివరణ ఇచ్చారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement