Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్ళరేవు బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ళరేవు బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఆటోను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

 

తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేట్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఆటోను ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. యానం దగ్గర నేలపల్లి గ్రామానికి చెందిన వారిగా మృతులను గుర్తించారు . ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి కావడంతో గ్రామంలో విషాదఛాయలు ఉన్నాయి. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది.. మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ప్రైవేట్ బస్ ఢీ కొన్న సమయంలో ఆటోలో ఎనిమిది మంది ఉన్నారు..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వారిని ఎస్ఐ పి శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement