విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
దిగ్విజయం గా ముగిసిన కోనసీమ జిల్లా చెస్ చాంపియన్ షిప్ : జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం లయన్స్ క్లబ్ లో నిర్వహించిన ఓపెన్ మరియు మహిళల చెస్ పోటీలు ఉత్సాహవంతంగా జరిగాయి. జిల్లా చెస్ ఆసోషియేషన్ కన్వీనర్ తాడి వెంకట సురేష్ ఆధ్వర్యాన జరిగిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి 70 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో ద్రాక్షారపు సాత్విక్ చాంపియన్ గా, కొండా శివేంద్ర ద్వితీయ స్థానం, యర్రంశెట్టి చరణ్ తృతీయ స్థానం, గిరిమణి శేకర్ నాల్గవ స్థానం సాధించి ఈనెల 25నుండి తిరుపతిలో జరుగనున్న రాష్ట్ర చెస్ పోటీలకు ఎంపికయ్యారు. అలాగే బాలికల చదరంగ పోటీలలో పనిశెట్టి ధరణి చాంపియన్ కాగా గెద్దాడ అక్షయ ద్వితీయ స్థానం జి. ఆశ్రయ తృతీయ స్థానం, బండారు జోష్ణవి నాల్గవ స్థానం సాధించి ఈనెల 18నుండి విజయవాడలో జరిగే రాష్ట్ర మహిళల చెస్ పోటీలకు ఎంపికైనారు. విజేతలకు లయన్స్ ప్రతినిధులు మరియు అంతర్జాతీయ చెస్ న్యాయ నిర్ణేత జి.వి.కుమార్ బహుమతులు అందజేశారు.