Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మల్లవరంలో పూర్వ విద్యార్థుల కలయిక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మల్లవరంలో పూర్వ విద్యార్థుల కలయిక

1997- 98 సంవత్సరం లో చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

 

తాళ్లరేవు మండల పరిధిలోని పి మల్లవరం పంచాయతీ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల కలయిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 1997- 98 పూర్వ విద్యార్థులు కలుసుకొని అప్పటి కాలం నాటి గురువులను సన్మానించారు. ఆ కాలంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి, అనంతరం కష్టసుఖాలను గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. కొందరు విద్యార్థులు మాట్లాడుతూ మేం చదువుకున్నప్పటి నుండి ఇప్పటివరకు 25 సంవత్సరాలు గడిచిందని, ఈ 25 సంవత్సరాలు అయిన సందర్భంగా మా తోటి స్నేహితులు అపూర్వ కలయిక ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి మేము అందరం ఏకమై ఈ కలయిక ఏర్పాటు చేసుకున్నామని వారు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు కలిసి భోజనాలు చేసి కార్యక్రమం ముగించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement