Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్ళరేవు రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మల్లాడి కృష్ణారావు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ళరేవు రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మల్లాడి కృష్ణారావు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్ళరేవులో గత వారంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఇంకొకరు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి, దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరామర్శించి వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. మరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున అలాగే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పుదుచ్చేరి నుండి వచ్చిన మల్లాడి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి ధ్యానం చరిత్రలోనే ఈ ఘటన చాలా ఘోరమైందని అది కూడా యాక్సిడెంట్ లో ఉన్న వారంతా యానంకు చెందిన వారే ఎక్కువ అని చాలా దురదృష్ట సంఘటనని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిని వివరాలు అడగగా మంత్రి మల్లాడికి వివరిస్తూ ముగ్గురికి ఆపరేషన్లు చేయగా వారు నెమ్మదిగా కోరుకుంటున్నారని వైద్య సిబ్బంది మల్లాడికి తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి మల్లాడి ఆసుపత్రి సిబ్బందిని కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement