కోరింగ ఎస్సై పి శ్రీనివాస్ కుమార్ వెల్లడి
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్ళరేవు మండల పరిధిలోని స్థానిక జార్జి పేట చెక్ పోస్ట్ వద్ద సాధారణ తనిఖీలలో భాగంగా కోరంగి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి కారులో యానం నుండి అక్రమ మద్యం తరలిస్తుండగా కోరంగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. అతని వద్ద నుండి 125 మద్యం బాటిల్స్ ను, ఒక కారును సీజ్ చేసి వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోరింగ ఎస్సై పి శ్రీనివాస్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ తనిఖీల్లో కోరంగి స్టేషన్ సిబ్బంది కానిస్టేబుల్ ఉన్నారు.