విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్ళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పత్తి గొంది గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది యడ్ల కుటుంబరావును బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ ఆధ్వర్యంలో కుటుంబరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడుతూ బౌద్ధం మతం కాదని ప్రజలకు ఒక జీవ సన్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలేకుర్రు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, సర్పంచులు శివరామ ప్రసాద్, పేర్ని ఆదినారాయణమూర్తి, రెడ్డి అరుణ సుహాసిని దేవి, దడాల సువర్ణ లత పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొని కుటుంబరావును సత్కరించారు.