Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మొట్టమొదటిగా కౌలు రైతులకు రుణ సదుపాయాన్ని కల్పించిన కలెక్టర్ హిమాన్సు శుక్లా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

జిల్లాలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టుగా డిసిసి బి బ్యాంక్ ద్వారా రైతులకు ఋణ సదుపాయాలు కల్పించిన కలెక్టర్

 

రైతులకు అగ్రికల్చర్ ప్రొఫెషనల్ గా నామకరణం చేసిన కలెక్టర్ హిమాన్సు శుక్లా

 

పది మండలాల్లో 10 గ్రామాలలో 40 మంది రైతులతో ప్రారంభం

 

దళారీ వ్యవస్థను తొలగించే దిశగా రైతులకు రుణ సదుపాయం

 

విశ్వం వాయిస్ కలెక్టరేట్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతనంగా పైలట్ ప్రాజెక్టుగా రైతులకు డిసిసి బి బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పత్రికా సమావేశంలో తెలియజేశారు

 

వివరాల్లోకి వెళితే

 

జిల్లాలో వరి పంటలు పండించే రైతులు ను అగ్రికల్చర్ ప్రొఫెషనల్ గా నామకరణం చేసిన జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ఆరు కాలాలు కష్టపడి పండించే రైతులు కు భరోసాగా దళారీ వ్యవస్థ పై ఆధారపడకుండా మండలంలో గల డీసీసీ బి బ్యాంకు ద్వారా 50,000 నుంచి 1 లక్ష రూపాయలు,రుణ సదుపాయాన్ని కల్పిస్తూ రైతుల ఎదుగుదలకు బాటలు వేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టుగా రైతులకు రుణ సదుపాయం ఇచ్చే విధంగా ప్రారంభానికి నాంది పలికిన కలెక్టర్ జిల్లాలో 10 మండలాలలో పది గ్రామాలలో 40 మంది రైతులతో గ్రామంలో వీఆర్ఏ ,వీఆర్వో , అగ్రికల్చర్ ఏవో, మండల తాసిల్దార్ ఆధ్వర్యంలో ఎంపిక చేసినట్లు తెలియజేశారు ప్రతి రైతు ఒక ఎకరం వరి పొలం నుంచి ఐదు ఎకరాల వరి పొలం కౌలుకు చేసిన వారికి 50, వేలు నుంచి లక్ష రూపాయల వరకు డిసిసి బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కల్పించినట్లు రుణాన్ని 11 నెలల కాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించే విధంగా ప్రణాళిక చేసినట్లు వివరించారు రైతులు ఆకుమడి కి దుక్కు దున్నిన కాలం నుంచి వరి కోతలు చేసే లోపుగా డబ్బులను తీసుకుని వారి అవసరాలకు వినియోగించుకోవచ్చు అని కావాలనుకుంటే ఒకే మొత్తంలో తీసుకుని రైతులు వినియోగించుకోవచ్చని 11 నెలల కాల పరిమితి లోపుగా డబ్బులు బ్యాంకుకి దప దపాలుగా గాని ఒకేసారి గాని చెల్లించవచ్చని రుణం తీసుకునే కౌలు రైతు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా ఆ గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వారు అయి ఉండాలని అగ్రికల్చర్ ప్రొఫెషనల్ కి ఖరీఫ్ వరి పంట కాలం నుంచి బ్యాంకులు ద్వారారుణ సదుపాయం అందించాలి అనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు రైతులు పంట సాగు చేయుటకు అవసరమైన ఎరువులు విత్తనములు క్రిమిసంహారక మందులు సకాలంలో రైతు భరోసా కేంద్రం ద్వారా వారికి పంపిణీ చేస్తారన్నారు పైలెట్ ప్రాజెక్టుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంపిక చేయబడిన అయినవిల్లి మండలం, పి గన్నవరం, అంబాజీపేట ,మల్కిపురం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం, అల్లవరం రాజోలు మామిడిపదు పది మండలాల్లో ఒక్కొక్క మండలాల్లో ఒక గ్రామాన్ని ఈ పథకానికి అమలు చేయనున్నారు ఈ పథకం జిల్లాలో విజయవంతమైన తరువాత రాష్ట్రస్థాయి బ్యాంకర్ సమావేశం దృష్టికి తీసుకువెళ్లి ఇతర వాణిజ్య బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందించే విధంగా జిల్లా వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ పాత్రికేయులకు వివరించారు కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సహకార బ్యాంక్ మేనేజర్ నరసింహారావు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు లీడ్ బ్యాంకు మేనేజర్ శ్యామ్ లతో కలిసి పత్రిక సమావేశంలో పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement