Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రాష్ట్రంలో కులగణన కి ప్రభుత్వం జీవో విడుదల హర్షం వ్యక్తం చేసిన సమాచార శాఖ మంత్రి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

*రాష్ట్రంలో కుల గణనకు ప్రభుత్వం జీవో విడుదల*

 

హర్షం వ్యక్తం చేసిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.

 

రామచంద్రాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

రాష్ట్రంలో కుల గణనకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల ఎన్నో ఏళ్లగా వివిధ వర్గాలు కోరిక సఫలం పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి రామచంద్రపురం లోని ఆయన నివాస గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి జీవోలో పేర్కొన్న అంశాలను పాత్రికేయులకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కుల గణన చేసేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 68 శుక్రవారం సాయంత్రం జారీ చేసిందని దీనితో రాష్ట్రంలో కుల గణనకు తొలి అడుగు పడిందని మంత్రి చెల్లుబోయిన వెల్లడించారు.

ఇచ్చిన మాటను చిత్తశుద్ధితో అమలు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుల గణన జీవో జారీపట్ల ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఏప్రిల్ 11వ తేదీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి రోజున బీసీ సంక్షేమ మంత్రిగా తాను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుల గణనకు సుముఖముగా ఉన్నట్లు వెల్లడించడం జరిగిందన్నారు.

దీనిపై బీహార్, ఒరిస్సా, పంజాబ్, కర్ణాటక రాష్ట్రంలో తో పాటు వివిధ రాష్ట్రాల్లో కుల గణన జరుగుతున్న తీరును అక్కడ ఎదుర్కొన్న అవాంతరాలను చిక్కులను గమనించడంతోపాటు కులగణనలో ఏమేమి అంశాలు అడ్డంకులు వస్తాయి, న్యాయపరమైన వచ్చే అంశాలను తదితర వాటిని బెరుజి వేసుకొని రాష్ట్రంలో కుల గణన జరిగే విధంగా ముఖ్యమంత్రి ఈరోజు జీవో జారీ చేశా రన్నారు.

ఈ కమిటీలో ఆరు సభ్యులు ఉంటారని మంత్రి తెలిపారు.

సెక్రటరీ ప్లానింగ్ కమిటీ కు కన్వీనర్ గా వ్యవహరిస్తారని, సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్,

స్పెషల్ చీఫ్ సెక్రటరీ వార్డ్, గ్రామ సచివాలయాలు,

స్పెషల్ చీఫ్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ , ప్రిన్సిపల్ సెక్రెటరీ సోషల్ వెల్ఫేర్, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, సభ్యులుగా ఉంటారన్నారు.

ప్రత్యేకంగా ఈ జీవో ప్రకారం బీసీ, ఎస్టీ ,ఎస్సీ ,మైనార్టీలు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న వర్గాలకు ఈ జీవోఎంతో మేలు జరుగుతుందన్నారు.

అదే విధంగా సామాజిక ఉద్యమకారులు ఇతర సామాజిక వర్గాల ఉద్యమాల ఆకాంక్ష ఫలితంగా నేటి జీవో ఫలితం అన్నారు. కుల గణన చేయడం ద్వారా ఆయా కులాల్లో బాగా వెనుకబడి ఉన్న వారికి మరింత సంక్షేమ పథకాలు రచించి అమలు చేసే విధంగా దోహదపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందుతున్నాయి అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ సచివాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు 50 నుండి 70 మంది కుటుంబాలకు ఒక వాలంటీర్లను నియమించి సంక్షేమ పథకాలు కడుపేద వర్గాలకు అందే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని దీనికి తోడు కుల గణన వలన మరింత మంది పేదవారికి లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.

గత పాలకులు కులగనన పై ఎలాంటి దృష్టి కేంద్రీకరించ లేదని మంత్రి వేణు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement