Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వరద సమయంలో పాడి పశువుల కోసం ఎండు గడ్డి సేకరణ పరిశీలించిన కలెక్టర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

*వరద సమయంలో పాడి పశువుల కోసం, ఎండు గడ్డి సేకరణ పరిశీలిస్తున్న కలెక్టర్*

 

విశ్వం వాయిస్ కలెక్టరెట్ న్యూస్

 

 

జిల్లా లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పాడి పశువులకు మూడు రోజులకు సరిపడా ఎండు గడ్డి సేకరణ

-డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

 

వరద ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడి పశువులకు మూడు రోజులకు సరిపడా ఎండు గడ్డిని ఆయా గ్రామాలలో అందుబాటులో ఉంచుతున్నామని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం వరదలు సంభవించినప్పుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండు గడ్డి తడిచిపోయి పశుగ్రాసం అందుబాటులో లేని నేపథ్యంలో బయట ప్రాంతాల నుంచి ఎండు గడ్డిని పశుసంవర్ధక శాఖ ద్వారా సుమారు 2.5 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కొన్నామన్నారు. కొన్ని చోట్ల సరైన సమయానికి బయట ప్రాంతాల నుంచి ఎండుగడ్డి జిల్లా కి సరఫరా కాకపోవడం తో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు . గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెవిన్యూ శాఖ .. జిల్లా లో వరద ప్రభావం ఎక్కువగా ఉండే 18 మండలాలలోని గ్రామాలను గుర్తించి .. పశుసంవర్ధక శాఖ సహాయంతో ఆయా గ్రామాలలోని పాడి పశువుల సంఖ్యకు అనుగుణంగా మూడు రోజులకు సరిపడా ఎండు గడ్డిని సేకరించి పల్లపు ప్రాంతాలలో నిల్వ చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ 18 మండలాల లో 65774 పాడి పశువులు ఉన్నాయని ఒక్కొక్క పశువు కు రోజుకి 7 కే జీ ల చొప్పున మొత్తం పశువులకు రోజు కి 460 మెట్రిక్ టన్నుల ఎండు గడ్డి అవసరం కాగా ఇప్పటి వరకు సుమారు 463 మెట్రిక్ టన్నుల గడ్డి సేకరించి సురక్షిత ప్రాంతాలలో నిల్వ చేశామన్నారు . ఆయా మండలాల లోని తహసీల్దార్లు రైతుల దగ్గర ఎండు గడ్డి సేకరిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం ఎండు గడ్డి సేకరణ లో భాగంగా కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ఎండు గడ్డిని దానం చేశారని.. మిగిలిన అవసరమైన ఎండు గడ్డి ని కలెక్టర్ నిధి నుంచి కొనుగోలు చేశామన్నారు. ఈ రబీ సీజన్ ముగిసే లోపు మూడు రోజులకి సరిపడా ఎండు గడ్డి ని సేకరించి ఆపత్కాలం లో రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రకటన లో తెలిపారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement