విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
*సీఎం సహాయనిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే కొండేటి, కలెక్టర్*
విశ్వం వాయిస్ కలెక్టరేట్ న్యూస్
పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం,అయినవిల్లి గ్రామ పంచాయతీ కి చెందిన వాలంటీర్ జనిపేల్ల దుర్గా ప్రసాద్,అంబాజీపేట మండలం, ఇసుకపూడి గ్రామ వాలంటీర్ కత్తుల శ్రీ కృష్ణ లు ఇద్దరు మరణించి వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. పి.గన్నవరం శాసన సభ్యులు కొండేటి చిట్టిబాబు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఒక్కక్కరి కుటుంబానికి 2 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరు చేయించారు. ఈ చెక్కులను శనివారం ఉదయం అమలాపురం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సమక్షంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా జనిపేల్ల దుర్గాప్రసాద్ భార్య జనిపేల్ల శ్రావణ సంధ్య , కత్తుల శ్రీకృష్ణ భార్య, కత్తుల సంధ్య కి అందజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరికీ ఔట్సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇప్పించాలని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాని కోరగా.. ఔట్సోర్సింగ్ లో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.