విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పోలే కుర్రు తోటపేట పి మల్లవరం జై భీమ్ పేట గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మహానాడు కార్యక్రమానికి తరలి వెళ్లినట్లు జక్కల ప్రసాద్ బాబు. మహానాడుకు వెళ్లడానికి ఆటోలు పికప్ లు ఏర్పాటుచేసి మహానాడు సభ విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన నాయకులలో పి మల్లవరానికి చెందిన ధూళిపూడి బాబి, పోలేకుర్రు పంచాయతీకి చెందిన జక్కల ప్రసాద్ బాబు , సాధనాల వెంకట శివ రామకృష్ణ, వి వెంకట రామకృష్ణ, జె ఈశ్వరరావు, ఆర్ సత్యనారాయణ అభిమానులు కార్యకర్తలు తరలి మహానాడు కార్యక్రమానికి వెళ్లారు.