అటవీ శాఖ ఆధ్వర్యంలో లైఫ్ ప్రోగ్రాం
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో లైఫ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. లైఫ్ ప్రోగ్రాం లో భాగంగా పలు గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పోలే కుర్రు, పి మల్లవరం గ్రామాల్లో పర్యటించి ప్రజల చేత పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.