Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కోరంగి అభయారణ్యం పర్యాటకులకు ప్రకృతి ఆస్వాదించే మడ అడవులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోరంగి అభయారణ్యం పర్యాటకులకు ప్రకృతి ఆస్వాదించే మడ అడవులు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా మండలంలోని కోరంగి పంచాయతీ పరిధిలోని కోరంగి గ్రామానికి చెందిన మడ అడవులు కాకినాడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ మడ అడవులను సందర్శించడానికి పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వస్తుంటారని ఫారెస్ట్ ఆఫీసర్, ఎఫ్ ఆర్ వో ఎం నాగార్జున మీడియాకు తెలిపారు. పర్యాటకులకు అన్ని సదుపాయాలు ఏర్పాట్లు ఉన్నాయని, సముద్రం వరకు వెళ్లే నదిపై ద్వారా బోటు షికారు సౌకర్యం ఉందని, ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా ప్రభుత్వం అలాగే ఫారెస్ట్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో జాతీయ రహదారి 216 నుండి మంచి రోడ్డు సదుపాయం అన్ని అందుబాటులో ఉన్నాయని, పర్యాటకులు మడ అడవుల్లో సందర్శించడానికి చెక్కలతో తయారు చేసిన వంతెన ఎంతో సందర్శకులను ఆకట్టుకుంటుందని అన్నారు. అనేక స్కూల్ నుండి కాలేజీల నుండి విద్యార్థులు సందర్శించడానికి క్యాంప్ రూపంలో వచ్చి మడ అడవుల విస్తరణ గురించి తెలుసుకుని వెళ్తారని, సందర్శకుల సౌకర్యార్థాల నిమిత్తం ఫుడ్ స్టాల్ పార్కింగ్ ప్రదేశం, టాయిలెట్లు అన్ని సౌకర్యాలు సందర్శకులకు అందుబాటులో ఉంచామని, బోటు షికారు కొరకు నది పాయ నుండి సముద్రం వరకు కూడా బోట్ షికారుకు సౌకర్యం ఉందని తెలిపారు. ప్రజల అవసరాలకు తగినట్లుగా అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు ఎం నాగార్జున మీడియాకు వివరించారు. రాబోయే రోజులలో మరింత అభివృద్ధి చేసి పర్యాటక రంగంలో కోరంగి మడ అడవులు ముందు స్థానంలో ఉండేందుకు కృషి చేస్తానని నాగార్జున మాట్లాడారు. కొద్ది రోజుల క్రితమే కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కుటుంబంతో వచ్చి మడ అడవులను సందర్శించారని వారు మీడియాకు గుర్తు చేశారు. ఈ మడ అడవులలో అనేక రకాల చెట్లు అనేక రకాల పక్షులు జాతులను డిస్ప్లే చేసి సందర్శకుల వివరణ కోసం ఉంచినట్లు మరియు సందర్శకులకు అడవులలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయని తెలుసుకునేందుకు అవగాహన కలిగేందుకు ఇన్ని రకాల సదుపాయాలు చెట్లు అలాగే పక్షుల యొక్క బోర్డులు ఏర్పాటు చేసి అందులో అడవులలోని మొక్క యొక్క పేరు వివరణ ఇస్తూ ఉంచారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మరిన్ని నూతన పద్ధతులలో సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఎం నాగార్జున తెలిపారు.

స్థానికులు మాట్లాడుతూ ఈ మడ అడవులు సముద్ర తీరాన ఉండి కాకినాడ జిల్లాకు మరియు తాళ్లరేవుకు రక్షణ కవచంగా ఉన్నట్లు స్థానికులు ఎస్ వెంకట శివరామకృష్ణ తెలిపారు. కోరంగి అభయారణ్యం స్వాగతం పలికే బోర్డు సైతం చెట్ల రూపంలోనే దానిని డిజైన్ చేసి ఎంతో అందంగా ఏర్పాటు చేసినట్లు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మడ అడవులు మన తాళ్లరేవు మండలంలో కోరంగి గ్రామంలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం అని వెంకట శివరామకృష్ణ అన్నారు. అనేక పర్యాయాలు రాష్ట్ర మంత్రులు సైతం వచ్చి మడఅడుగులను సందర్శించారని వారు గుర్తు చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement